పుష్పకు ఫస్ట్ ఛాయిస్ బన్ని కాదట.. ఆ హీరో ఎలా మిస్ చేసుకున్నాడబ్బా!

దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా స్టోరీని మొదటిగా మహేశ్ బాబుకి వినిపించగా డేట్లు సెట్ కాకపోవడం వల్ల రిజక్ట్ చేశారట. అలాగే శ్రీవల్లిగా సమంతను, విలన్‌గా విజయ్ సేతుపతి అనుకున్నారు. కానీ వీరు రిజక్ట్ చేయడంతో బన్ని, రష్మిక, ఫహాద్ ఫాజిల్‌కి ఛాన్స్‌లు వరించాయి.

New Update
pushpa 2 hindi collections

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందాన, విలన్‌గా నటించిన ఫహద్ ఫాజిల్ నటించారు. పుష్ప సినిమాతో ఈ ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్‌గా మారిపోయారు. అయితే పుష్ప మూవీకి ఫస్ట్ ఛాయిస్‌గా సుకుమార్ ఈ ముగ్గురు కాదట. వేరే ముగ్గురు స్టార్స్‌ను అనుకుని సుకుమార్ స్టోరీ రాసుకున్నాడు. ఆ ముగ్గురు రిజక్ట్ చేయడంతో వీరికి ఈ లక్కీ ఛాన్స్ దొరికింది. 

ఇది కూడా చూడండి: యూన్‌‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు

ఫస్ట్ ఛాయిస్‌గా సూపర్ స్టార్..

సుకుమార్ మొదటిగా పుష్ప స్టోరీని సూపర్ స్టార్ మహేశ్  బాబుకి చెప్పారట. కానీ ఈ పాత్రలో నటించడానికి మహేశ్ బాబు కాస్త ఆలోచించారట. ఆ కారణంగానే సినిమాకి రిజక్ట్ చేశారట. అలాగే డేట్లు కూడా సెట్ కాకపోవడం వల్ల రిజక్ట్ చేశారట. దీంతో సుకుమార్ బన్నికి కథ చెప్పడంతో సినిమా పార్ట్-1 వచ్చింది. 

ఇది కూడా చూడండి: రేపే పింక్‌ బాల్‌ టెస్ట్‌ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే!

హీరోయిన్ శ్రీవల్లి పాత్ర కోసం సుకుమార్ ముందుగా సమంతని సెలక్ట్ చేశారట. కానీ ఇదివరకే సుకుమార్ దర్శకత్వంలో సమంత రంగస్థలం సినిమా చేసింది. ఇందులో కూడా పల్లెటూరి క్యారెక్టర్.. పుష్పలో కూడా సేమ్ అని రిజక్ట్ చేసిందట. 

ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ ఇదే!

విలన్‌గా పుష్పలో మెప్పించిన ఫహద్ ఫాజిల్‌కి బదులు విజయ్ సేతుపతిని సుకుమార్ సంప్రదించారట. అతని బిజీ షెడ్యూల్ వల్ల విజయ్ సేతుపతి నో చెప్పడంతో ఫహద్ ఫాజిల్‌కి ఈ అవకాశం దక్కింది. పుష్ప సినిమాతో ఈ ముగ్గురు వరుస అవకాశాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. 

ఇది కూడా చూడండి:  పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు