/rtv/media/media_files/2025/03/30/V19q75Vp2pBQM0uH79uO.jpg)
harish-and-modi
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కీలక కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన పర్సనల్ లైఫ్ విషయాలను పూర్తిగా బయట పెట్టారు. మాది మధ్యతరగతిలోని ఒక పెద్ద కుటుంబమని చెప్పుకొచ్చారు హరీష్. తమ తల్లిదండ్రుకు తాను పెద్ద కొడుకును కావడంతో తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. చెల్లికి పెళ్లి చేయడం, తమ్ముడిని సెటిల్ చేయడం, అమ్మానాన్నలకు మంచి జీవనశైలి కల్పించడం తాను బాధ్యతలుగా భావించానని చెప్పారు. అందుకు తన నా భార్య స్నిగ్ధ తనకు అండగా నిలిచిందన్నారు.
వాటితోనే తాను అలసిపోయానని.. ఇలాంటి బాధ్యతలు మళ్లీ వద్దు అనిపించిందన్నారు. ఇక మిగిలిన జీవితాన్ని బాధ్యతల నుంచి వెనక్కి తగ్గకుండా గడపాలని నిర్ణయించుకున్నామని, అందుకే పిల్లలు వద్దనుకున్నామని చెప్పుకొచ్చాడు హరీష్. తాను తన భార్య కూర్చుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ఒక్కసారి పిల్లలు పుడితే.. వారి గురించి మాత్రమే ఆలోచిస్తామని మనలో స్వార్ధం పెరిగిపోతుందని.. ప్రపంచాన్ని కుదించుకోవటం మొదలవుతుందన్నారు. తాను, తన భార్య జీవితాన్ని ఆ బంధనాల్లో పెడదామనుకోలేదని హరీష్ తెలిపాడు.
Also read: Ap News: ఏపీలో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లే....
మోడీ మూడుసార్లు విజయం సాధించడానికి
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావన తెచ్చారు హరీష్. మోడీ మూడుసార్లు విజయం సాధించడానికి ఆయనకు పిల్లలు లేకపోవడం కూడా ఒక కారణమేనని అన్నారు. ఒక వ్యక్తి పిల్లలు లేకుంటే నిస్వార్థంగా, బాదరబందీలకు లోనికాకుండా పనిచేయగలడు అనే భావన ప్రజల్లో ఉంది. మోడీ కూడా అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. తన భార్య ఓ డాక్టర్ అని తనకు సినిమాలంటే ఇష్టముండదని తెలిపారు హరీష్. తాను సినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటానో కూడా ఆమెకు తెలియదన్నారు. హరీశ్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నాను. టీజర్ లాంఛ్ లో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.!