Karthikeya 3: చందూ మొండేటి (Chandu Mondeti)పదేళ్ల క్రితం తన తొలి సినిమాగా ‘కార్తికేయ’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తో సూపర్ హిట్ అందుకొని తన టాలెంట్ నిరూపించుకున్నాడు. తరువాత, ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమమ్’ విజయాన్ని సాధించగా, ‘సవ్యసాచి’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ పరాజయంతో చందూ టాలెంట్ పై అనేక అనుమానాలు వచ్చాయి. అయితే, ‘కార్తికేయ-2’ తో చందూ మళ్లీ తన మాస్ డైరెక్షన్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.
అప్పటి నుంచి చందూ మొండేటి మీద అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం, ఆయన తెరకెక్కిస్తున్న ‘తండేల్’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో పాటు, ఆయన ‘కార్తికేయ-3’ కూడా తీస్తానని ప్రకటించాడు. ‘కార్తికేయ-2’ సంచలన విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు ‘కార్తికేయ-3’ పై భారీ హైప్ నెలకొంది.
Also Read: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
కార్తికేయ-3’ కూడా కృష్ణ భగవానుడి కథే..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చందూ, ‘కార్తికేయ-3’ గురించి కొన్ని కీలక విషయాలను పంచుకున్నాడు. ఈ చిత్రం చాలా కొత్త అనుభవాన్ని ఇవ్వనుందని. ‘‘కార్తికేయ-3 కోసం ఒక అద్భుతమైన కథ రెడీ చేసుకున్నాడని. ‘కార్తికేయ-2’ సక్సెస్ తరువాత పెరిగిన బాధ్యతను తాను మర్చిపోలేదని అన్నారు. ‘కార్తికేయ-2’ ద్వారా కృష్ణ భగవానుడి ఆశీర్వాదం కొత్త జీవితాన్ని, కెరీర్‌ను ప్రసాదించింది. అందుకు నేను భక్తి పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘కార్తికేయ-3’ కూడా కృష్ణ భగవానుడి కథను ఆధారంగా తీసుకొని సాగుతుంది’’ అని చెప్పారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
చందూ మొండేటి మాట్లాడుతూ, ‘‘నేను ఎప్పటి నుంచో కృష్ణుడి గురించి ప్రేక్షకులకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ‘కార్తికేయ-2’ ద్వారా అనేక మంది పిల్లలు కూడా కృష్ణుడి గురించి తెలుసుకోవడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇకపై నా సినిమాల ద్వారా మన సంస్కృతి, మూలాలు, పురాణాల ఆధారంగా మరిన్ని కథలను చెప్పాలని అనుకుంటున్నట్లు’’ వెల్లడించారు.
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!