Devara : విశ్వక్, సిద్దూతో 'దేవర' స్పెషల్ ఇంటర్వ్యూ.. లీకైన ఫోటోలు తెలుగులో 'దేవర' ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ షూట్ చేస్తుండగా ఓ ఫొటోను మూవీ యూనిట్ డైరెక్ట్ గా లీక్ చేసింది. By Anil Kumar 13 Sep 2024 in సినిమా New Update షేర్ చేయండి Devara Special Interview : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' మరో రెండు వారాల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ లో విపరీతమైన హైప్ పెంచింది. అందుకు తగ్గట్లుగానే మూవీ టీమ్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేసింది. ఇప్పటికే ముంబైలో 'దేవర' ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరూ నార్త్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక తాజాగా మన తెలుగులో 'దేవర' ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అదికూడా యంగ్ హీరోలైన విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ తో కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. Massive waves…Massive energy ❤️❤️ #Devara pic.twitter.com/8E6NpOZYBf — Devara (@DevaraMovie) September 13, 2024 తాజాగా ఈ ఇంటర్వ్యూ షూట్ చేస్తుండగా ఓ ఫోటో మూవీ యూనిట్ డైరెక్ట్ గా లీక్ చేసి మాసివ్ ఇంటర్వ్యూ రాబోతుంది అని హింట్ ఇచ్చింది. విశ్వక్ సేన్, సిద్దూ ఇద్దరూ తారక్ బాగా క్లోజ్. విశ్వక్ అయితే మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ వీరాభిమాని అని తెలిసిందే. గతంలో విశ్వక్ సినిమా ఈవెంట్స్ కి ఎన్టీఆర్ వచ్చాడు. అటు 'టిల్లు స్క్వేర్' మూవీ టైంలో ఈ ముగ్గురు కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురితో స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతుందని తెలియడంతో ఫ్యాన్స్ ఈ ఇంటర్వ్యూ కోసం తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #devara #ntr సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి