జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో నటించిన 'దేవర' ఇటీవల థియేటర్స్ లో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా.. అన్ని చోట్ల సినిమాకి భారీ ఆదరణ దక్కింది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
అయితే ఈ సినిమా సక్సెస్ లో అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ ప్రధాన పాత్ర పోషించాయి. ఇటీవల ఆ సాంగ్స్ ను ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయుధ పూజా, చుట్టమల్లే ఫుల్ వీడియో సాంగ్స్ రిలీజ్ అవ్వగా.. తాజాగా 'దావుదీ' ఫుల్ వీడియో సాంగ్ ను వదిలారు. 'దేవర' రిలీజ్ అయినప్పుడు ఈ సాంగ్ లేదు. పలు కారణాలతో ఈ పాటను ఎడిటింగ్ లో లేపేశారు.
Also Read : కెరీర్ లో ఫస్ట్ టైం గెస్ట్ రోల్ లో మహేష్ బాబు.. ఏ సినిమాలో అంటే?
ఫుల్ వీడియో వచ్చేసింది..
ఆ తర్వాత ఫ్యాన్స్ డిమాండ్ మేరకు వారం తర్వాత అదే సాంగ్ ను యాడ్ చేశారు. కానీ అప్పటికే సినిమాను చాలా మంది చూసేశారు. దాంతో ఈ సాంగ్ ను మిస్ అయ్యాం అని ఫీలయ్యారు. అయితే అదే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజయింది. థియేటర్స్ మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్ లో చూసేయొచ్చు.
The electrifying #Daavudi Full Video Song is here! ❤️🔥https://t.co/LGgDfAIOrD
— NTR Arts (@NTRArtsOfficial) October 28, 2024
Let the Speakers Blast and the Mass Energy take over🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/iqgqTG4Glm
Also Read : అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసుల ఎదురుదెబ్బ..'పుష్ప2' కు ఊహించని షాక్?
'టీ సిరీస్ తెలుగు' యూట్యూబ్ ఛానెల్ లో 'దావుదీ' ఫుల్ వీడియో సాంగ్ ను చూడొచ్చు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా పవర్ ఫుల్ రోల్ లో పోషించారు. జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటించింది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శ్రుతి మరాఠే, షైన్ టామ్ చాకో, నారాయణ్, కలైయరసన్, మురళీ శర్మ, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.