'దేవర' హిట్టు బొమ్మ.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్, తారక్ చెప్పిందే నిజమైంది

'దేవర' సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు సమాచారం. ఈ మూవీ వరల్డ్ వైడ్ 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. తాజాగా ఈ మూవీ 396 కోట్లు కలెక్ట్ చేయడంతో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది.

New Update
devra ntr

'మీరంతా కాలర్ ఎగరేసేలా 'దేవర' సినిమా ఉంటుంది.. సినిమా చూసి మీరంతా కాలర్ ఎగరేస్తారు, ఇదే నా ప్రామిస్'.. 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ తో చెప్పిన మాట ఇది. ఈ ఒక్క మాటతో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. సెప్టెంబర్ 27 సినిమా రిలీజయింది. తారక్ చెప్పిందే జరిగింది. ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. 

దాంతో సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ నిజంగానే కాలర్ ఎగరేసుకుంటూ థియేటర్స్ నుంచి బయటికొచ్చారు. ఇక నార్మల్ ఆడియన్స్ నుంచి మాత్రం రిలీజ్ రోజున మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాత రోజు నుంచి టాక్ మారుతూ వచ్చింది. దాంతో కలెక్షన్స్ పెరిగాయి. తాజాగా సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు సమాచారం. అదికూడా వారం రోజుల్లోనే జరగడం విశేషం.  

హిట్టు బొమ్మ..

దేవర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా నిన్నటి వరకు అంటే రిలీజయిన ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.396 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా నేడు ప్రకటించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. ఇప్పటికి రూ.396 కోట్లు కలెక్ట్ చేయడంతో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది.

అంటే 'దేవర' హిట్టు బొమ్మ అనే విషయం స్పష్టమవుతోంది. దీంతో ఎన్టీఆర్ చెప్పిందే నిజమైందని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ అంతా మరోసారి కాలర్ ఎగరేసే సమయం ఇదని అభిమానులు నెట్టింట వరుస పోస్టులు పెడుతున్నారు.  మరోవైపు  ఇవాళ్టి నుంచి దసరా సెలవులు కూడా ఉండటంతో కలెక్షన్స్ నేటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని మూవీ యూనిట్ భావిస్తున్నారు. దసరా పండగ వరకు సినిమా కచ్చితంగా 500 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay Devarakonda: "లవ్‌ యూ అన్నా".. అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ సర్ప్రైజ్‌ గిఫ్ట్‌..

విజయ్‌ దేవరకొండ హైదరాబాద్ లో తన కొత్త రౌడీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా అల్లు అర్జున్‌ కు గిఫ్ట్‌ పంపగా, బన్నీ‘‘స్వీట్‌ బ్రదర్‌’’ అంటూ స్పందించాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం మరోసారి హైలైట్ అయింది.

New Update
Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda: టాలీవుడ్‌ యూత్ ఐకాన్ అల్లు అర్జున్‌(Allu Arjun), రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ పరిశ్రమలో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న సాన్నిహిత్యాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలిపారు.

Also Read: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

మై స్వీట్‌ బ్రదర్‌..

హైదరాబాద్‌లో తన "రౌడీ" బ్రాండ్ స్టోర్‌ను(Rowdy Brand Store) ప్రారంభించిన విజయ్‌ దేవరకొండ, ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, పిల్లల కోసం బర్గర్లను గిఫ్ట్‌గా పంపారు. ఈ చిన్న సర్ప్రైజ్‌ బన్నీ మనసును గెలుచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ గిఫ్ట్ ఫొటోను షేర్ చేస్తూ, "మై స్వీట్‌ బ్రదర్‌.. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆశ్చర్యపరుస్తూ ఉంటావు. సో స్వీట్‌!" అంటూ అల్లు అర్జున్‌ హృదయపూర్వకంగా స్పందించాడు.

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

ఇది తొలిసారి కాదు ‘పుష్ప 2’ విడుదల సమయంలో కూడా విజయ్‌ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పుష్ప’ టీషర్ట్‌లు బన్నీకి పంపిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అల్లు అర్జున్‌ ఆనందంతో, ‘‘నా స్వీట్‌ బ్రదర్‌.. నీ ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ అభినందించాడు. దీనికి విజయ్‌ దేవరకొండ ‘‘లవ్ యూ అన్నా.. మన స్నేహం ఇలానే కొనసాగుతుంది’’ అని రిప్లై ఇచ్చాడు.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న భారీ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు, దీనిని గౌతమ్‌ తిన్ననూరి డైరెక్ట్‌ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment