Peddi Trailer: ‘పెద్ది’ డైలాగ్‌తో హైప్ ఎక్కిస్తున్న బాస్.. "జస్ట్ వావ్" అంటూ వైరల్ పోస్ట్!

‘పెద్ది’ ట్రైలర్ చూసిన చిరంజీవి చాలా పవర్ ఫుల్‌గా ఉందని ప్రశంసించారు. రామ్ చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ తమ బెస్ట్ ఇచ్చారని తెలిపారు. ట్రైలర్‌లోని “నేను ఆడలేదు… పోరాడాను సారు” డైలాగ్‌ను కూడా లీక్ చేశారు. ట్రైలర్ మే 18న విడుదల కాగా, సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

New Update
Peddi Trailer

Peddi Trailer

Peddi Trailer: ‘పెద్ది’ సినిమా ట్రైలర్ విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకుంది. చిరంజీవి Chiranjeevi ఇప్పటికే ట్రైలర్‌ను చూసి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రైలర్ చూసిన వెంటనే ఆయన “జస్ట్ వావ్” అంటూ ప్రశంసలు కురిపించారు.

రామ్ చరణ్ Ram Charan హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సాన Buchi Babu Sana ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత A. R. Rahman అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

చిరంజీవి మాట్లాడుతూ, “మూడు నిమిషాల ట్రైలర్ చాలా పవర్ ఫుల్‌గా ఉంది. ఎమోషన్, యాక్షన్, ఎలివేషన్స్ అన్నీ మరో స్థాయిలో ఉన్నాయి. చరణ్, బుచ్చిబాబు, రెహమాన్ తమ బెస్ట్ ఇచ్చారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ట్రైలర్ ఇంకా ఎక్కువగా ఆకట్టుకుంటుంది” అని తెలిపారు.

ఎప్పటిలాగే ఈసారి కూడా చిరంజీవి ఒక చిన్న లీక్ ఇచ్చారు. ట్రైలర్‌లోని ఓ పవర్ ఫుల్ డైలాగ్‌ను బయటపెట్టారు.
“మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు” అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్ అవుతుందని చెప్పారు.

అలాగే దర్శకుడు బుచ్చిబాబును సరదాగా ట్యాగ్ చేస్తూ, “సారీ బుచ్చిబాబు… ట్రైలర్ చూసాక కంట్రోల్ కాలేక ఈ డైలాగ్ లీక్ చేయాల్సి వచ్చింది” అని ట్వీట్ చేశారు.

‘పెద్ది’ ట్రైలర్‌ను మే 18న ముంబైలో జరిగే ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిరంజీవి ఇచ్చిన రివ్యూతో మెగా అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు