ఎంతకు తెగించార్రా.. ఛావా మూవీ చూసి టార్చిలైట్లతో నిధుల వేటకు!

ఛావా మూవీ చూసి కొంతమంది నిధుల వేటకు వెళ్లారు. అసీర్‌గఢ్ కోటలో నిధులు ఉన్నాయనే నమ్మకంతో రాత్రి సమయంలో కూడా మెటల్ డిటెక్టర్లు, టార్చిలైట్లు వేసుకుని మరీ వెతుకుతున్నారు. దీంతో విషయం తెలుసుకుున్న అధికారులు మరోసారి తవ్వితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

author-image
By Krishna
New Update
chhava inspire

థియేటర్ లో సినిమా మొదలయ్యే ముందు ఇందులోని పాత్రలు,సన్నీవేశాలు కేవలం కల్పితం అని ఇస్తారు. కానీ ఇవేం పట్టించుకోకుండా కొంతమంది నిజమే అనుకుంటే  ఎవరూ ఏమీ చేయలేరు. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఛావా సినిమా చూసిన జనం అందులోని ఓ సీన్ కు బాగా ఇన్ స్పైర్ అయి పగలు రాత్రి అనే తేడా లేకుండా నిధుల కోసం వేటకు బయలుదేరారు. శివాజీ మహారాజ్ తన నిధులు దాచిన చోటు ఇక్కడే అంటూ తవ్వకాలు మొదలుపెట్టారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మరాయి.  

ఇంతకు ఏం జరిగిందంటే  

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ వీరత్వంపై బాలీవుడ్ లో ఛావా అనే మూవీ తెరకెక్కింది.  శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా, మహారాణి యేసుబాయిగా రష్మిక మందన్న నటించారు. అయితే సినిమాలో శంభాజీని ఓడించిన ఔరంగజేబు మరాఠా రాజుల వద్దున్న నిక్షేపాలను  దోచుకున్నట్లుగా..  దాన్ని బుర్హాన్‌పూర్‌లో గల అసీర్‌గఢ్ కోటలో దాచి పెట్టినట్లుగా చూపించారు. 

దీంతో ఇదంతా నిజమే అనుకుని అక్కడ నిధులు, నగలు ఉన్నాయనే నమ్మకంతో  రాత్రి సమయంలో కూడా మెటల్ డిటెక్టర్లు, టార్చిలైట్లు వేసుకుని మరీ వెతుకుతున్నారు జనాలు.  దీంతో విషయం తెలుసుకుున్న అధికారులు అక్కడికి చేరుకోగా అక్కడ పెద్ద పెద్ద గుంతలే  వారికి దర్శనమిచ్చాయి. మరోసారి ఇక్కడ ఎవరైనా తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read :  IND vs NZ : ఫైనల్లో టీమిండియా గెలవకూడదు..  అశ్విన్ కీలక కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు