‘కంగువా’ నిర్మాతపై కోర్టులో కేసు.. మళ్ళీ వాయిదా తప్పదా? కంగువ మూవీ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాపై మద్రాసు హైకోర్టులో కేసు నమోదైంది. తమ నుంచి జ్ఞానవేల్ రాజా రూ.99.22 కోట్లు అప్పు తీసుకున్నాడని నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపింది. నవంబర్ 7న ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది. By Seetha Ram 02 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కంగువ’. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. దర్శకుడు శివ ఈ చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నాడు. ఇందులో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తుంది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. Also Read: నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు కలిసి నిర్మిస్తున్నారు. అదే సమయంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నైజాం ఏరియాలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీపై అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ సినిమా ఇప్పటి వరకు టచ్ చేయలేకపోయిన రూ.1000 కోట్ల మార్క్‌ను ‘కంగువ’ మూవీ టచ్ చేసి చూపించబోతుంది అంటూ పలువురు చెప్పుకొస్తున్నారు. Also Read: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది! నవంబర్ 14న రిలీజ్ ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లతో మూవీ యూనిట్ ఫుల్ బిజీ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే చిత్రబృందం ముంబైని చుట్టేసింది. అలాగే తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితులైన సూర్య సైతం పలు షోలకు హాజరవుతున్నాడు. Also read: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్...కూలిన భారీ భవనాలు! ఊహించని సమస్య ఇక అంతా అనుకున్నట్లే సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని సమస్య తలెత్తింది. ఈ మూవీ నిర్మాత అయిన జ్ఞానవేల్ రాజా పై మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తమ వద్ద నుంచి జ్ఞానవేల్ రాజా రూ.99.22 కోట్లు అప్పు తీసుకున్నాడని తెలిపింది. Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..! డబ్బు చెల్లించిన తర్వాతే ‘కంగువ’ రిలీజ్ కొంత వరకు చెల్లించాడని.. మిగతా రూ.45 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ఆ మిగతా అమౌంట్‌ను చెల్లించిన తర్వాతనే ‘కంగువ’ మూవీని రిలీజ్ చేసుకోవాలని ఆదేశించాల్సిందిగా హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు నవంబర్ 7న వాదనలు వినేందుకు అంగీకరించింది. మరి ఈ సమస్య ‘కంగువ’ రిలీజ్‌పై ఎంతమేర పడుతుందో చూడాలి. #actor-suriya #disha-patani #kanguva-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి