మహాకుంభమేళాలో తన కళ్లతో ఆకట్టుకుని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా భోంస్లేకు బంపరాఫర్ వచ్చింది. ఆమెకు ఏకంగా బాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ , నిర్మాత సనోజ్ మిశ్రా తన కొత్త సినిమాలో మోనాలిసాను తీసుకోబోతున్నారు. తన అందానికి, అమాయకత్వానికి తాను ఫిదా అయిపోయానని సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమెకు తన కొత్త సినిమాలో అవకాశం ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. మోనాలిసాను కలిసేందుకు త్వరలోనే తాను ప్రయాగ్ రాజ్ కు వెళ్లనున్నట్లుగా వెల్లడించారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం తరతరాలుగా పూసలదండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. కుటుంబానికి తోడుగా మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి పూసలదండలు అమ్ముతుంది. ఈ క్రమంలోనే ప్రయాగ్ రాజ్ కు పూసలదండలు అమ్మడానికి వచ్చింది. దీంతో ఇక్కడ ఆమె అమాయకపు చూపులకు, కళ్లకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమె ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన సనోజ్ మిశ్రా ఆమె అందానికి ఫిదా అయిపోయారు. 'ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్', 'రామ్ కి జన్మభూమి' చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు మిశ్రా తన తదుపరి చిత్రానికి మోనాలిసా కోసం స్పెషల్ గా ఓ పాత్రను క్రియేట్ చేశారని.. ఆ పాత్ర చుట్టే కథ నడస్తోందని తెలుస్తోంది. ఒక్క సినిమా కూడా చేయని.. మోనాలిసా కోసం స్పెషల్ గా రోల్ క్రియేట్ చేయడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి.
The viral sensation from Indore, Monalisa Bhosle, who won hearts while selling garlands at the Maha Kumbh Mela 2025 in Prayagraj, has been sent home by her father following declining sales and her sudden rise to internet fame.
— Kungfu Pande 🇮🇳 (Parody) (@pb3060) January 20, 2025
Who is Monalisa?
Monalisa Bhosle, fondly called the… pic.twitter.com/HI225vDjmK
మోనాలిసా భోంస్లే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఆమెకు శాపంగా మారిందన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఆమె అందం జీవనోపాధిని దెబ్బతీసే విధంగా మారిందని అంటున్నారు. ఈ క్రమంలో మోనాలిసా తన స్టాల్ చుట్టూ జనాలు గుమిగూడటంతో ఆమె తండ్రి.. ఆమెను తన సొంతూరికి తీసుకువెళ్లాడని తెలుస్తోంది. బతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పూసలు అమ్మకుంటే ఇక్కడ తమను పనిచేసుకోనివ్వకుండా బిజినెస్ కుల అడ్డుపడటంతో.. ఇక ఇవన్నీ తట్టుకోలేని మోనాలిసా తండ్రి.. ఆమెను తమ స్వస్థలం అయిన ఇండోర్‌కు పంపించేశారట. కాగా ఈనెల 13వ తేదీన ప్రారంభం అయిన మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజులపాటు సాగనుంది.