Peddi : రామ్ చరణ్ కు బిగ్ షాక్.. మరో వివాదంలో పెద్ది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా బృందంతో పాటు సెన్సార్ బోర్డు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆదివాసీ సంఘాలు తిరగబడటం ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర సంచలనంగా మారింది.

New Update
peddi movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా బృందంతో పాటు సెన్సార్ బోర్డు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆదివాసీ సంఘాలు తిరగబడటం ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర సంచలనంగా మారింది. సినిమాలో తమ మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయంటూ ఆదివాసీ సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు, జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. 

చిత్ర యూనిట్‌పై, అలాగే దీనికి అనుమతి ఇచ్చిన సెన్సార్ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే సినిమా మొత్తం నిడివిలో దాదాపు 15 సార్లు గిరిజనులను, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడేలా కొన్ని పదాలను వాడారని వారు ఆరోపిస్తున్నారు. గిరిజన హక్కుల చట్టం ప్రకారం ఏ పదాలనైతే వాడకూడదని స్పష్టంగా ఉందో... అదే పదాలను ఈ సినిమాలో చాలా అసభ్యకరంగా ఉపయోగించారని ఆదివాసీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో ఈ పదాలను వాడటం వల్ల, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఆ మాటలను పట్టుకుని ఇష్టానుసారంగా వాడుతున్నారని, దీనివల్ల సమాజంలో తమకు అవమానం జరుగుతోందని వారు మండిపడుతున్నారు.

బాక్సాఫీస్‌ను షేక్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా  జూన్ 4న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా  బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రూ. 300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక సోలో ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. కేవలం ఇండియాలోనే నెట్ కలెక్షన్స్ రూ. 157 కోట్లు దాటాయి. ముఖ్యంగా నైజాం, ఆంధ్రా ఏరియాల్లో థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. సినిమా విజయవంతంగా నడుస్తున్నా, మరోవైపు ఒక పెద్ద వివాదం నడుస్తోంది. సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు