Balayya Padma Bhushan: జై బాలయ్య.. పద్మ భూషణ్ వేళ అభిమానికి బాలయ్య ఫోన్ కాల్ .. పోస్ట్ వైరల్

పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా బాలయ్య తన అభిమానికి ఫోన్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ విషయాన్ని అభిమాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

New Update
balayya fan moment

balayya fan moment

Balayya Padma Bhushan: 'గాడ్ ఆఫ్ మాసెస్ గా'  సినీ ఇండస్ట్రీలో సెపెరేట్ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ.  యాభై ఏళ్లుగా   తనదైన ఛరిష్మాతో తెలుగు అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. సినిమా ఏదైనా, ఈవెంట్ ఏదైనా  'జై బాలయ్య' స్లోగాన్ మాత్రం పక్కా అనే రేంజ్ లో మాస్ ఆడియన్స్ క్రేజ్ దక్కించుకున్నారు. 

 Also Read: Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం!

అభిమానికి బాలయ్య ఫోన్ 

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఓ అభిమానికి ఫోన్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు బాలయ్య.  ఈ విషయాన్ని ఫ్యాన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లెజెండ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పద్మ భూషణ్ అవార్డు సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశాను. అన్నయతో ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ని ఎప్పటికీ పంచుకునే మెమరబుల్ మూమెంట్ ఇది. జై బాలయ్య.. అంటూ పోస్ట్ పెట్టాడు ఫ్యాన్. 

అభిమానులకు రుణపడి ఉంటాను.. 

పద్మ భూషణ్ అవార్డు పై స్పందించిన బాలయ్య ప్రభుత్వానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. యాభై ఏళ్ళ సుదీర్ఘ  సినీ  ప్రయాణంలో పాలు పంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు యావత్ చలనచిత్ర రంగానికి కృతజ్ఞతలు చెప్పారు.  స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఆయన వారసుడిగా నేటి  వరకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, ప్రేక్షకలోకానికి సదా రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. 

 Also Read:  Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?

Advertisment
Advertisment
Advertisment