/rtv/media/media_files/2025/04/12/rNRoTTxf1b5RwRnx17dc.jpg)
Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram
నందమూరి కల్యాణ్‌రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన కొత్త సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. సయీ మంజ్రేకర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు.
ట్రైలర్ అదుర్స్
ఇవాళ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. టైటిల్‌కు తగ్గట్లుగా తల్లీకొడుకుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యమున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.
(Arjun Son Of Vyjayanthi)