BIG BREAKING: RGVకి బిగ్ రిలీఫ్!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. మొత్తం మూడు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

New Update
rgv01

RGV: కేసులతో ఇరుకున పడ్డ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ల మార్ఫ్‌డ్ ఫోటోలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి తమ మనోభావాలు దెబ్బ తీశారని టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుల్లో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ.

Also Read: చీటింగ్ కేసులో ప్రముఖ నటుడికి ఢిల్లీ కోర్టు నోటీసులు!

ఈ కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ బెయిల్ పిటిషన్ వేశారు. పలు మార్లు ఈ కేసుపై విచారించి.. వాయిదాలు వేసిన ధర్మాసనం నేడు తుది తీర్పు వెలువరించింది. అర్జీవీకి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. మొతం మూడు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని రాంగోపాల్‌వర్మకు హైకోర్టు ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే బెయిల్ రద్దు అవుతుందని పేర్కొంది. 

అసలేమైంది...

గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై అసభ్యకర పోస్టులు పెట్టారని.. అలాగే 'వ్యూహం' మూవీ ప్రమోషన్ సమయంలో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేత మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఆర్జీవీపై కేసు పెట్టారు. ఆయన ఫిర్యాదుతో ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆర్జీవికి నోటీసులిచ్చారు. తనపై నమోదు అయిన కేసును కొట్టేయాలని ఆర్జీవి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే పలుమార్లు ఈ కేసు పై విచారణ వాయిదా పడగా.. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆర్జీవీకి భారీ ఊరట లభించింది.

Also Read: 46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్!

Also Read: RGVకి బిగ్ రిలీఫ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Film Pyre: అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఏకంగా 6 విభాగాల్లో 'పైర్' నామినేషన్

నేషనల్ అవార్డు విజేత డైరెక్టర్ వినోద్ కాప్రి తెరకెక్కించిన 'పైర్' 24వ ఇమాజిన్ ఇండియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 6 విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, సంగీతం, ఉత్తమ DOP, ఉత్తమ సౌండ్ డిజైనింగ్ విభాగంలో నామినేట్ చేయబడింది.

New Update
Indian film pyre nominated for 6 categories at 24th Imagine India International Film Festival

Indian film pyre nominated for 6 categories at 24th Imagine India International Film Festival

Indian Film Pyre:  2024లో  నేషనల్ అవార్డు గ్రహీత దర్శకుడు వినోద్ చోప్రా రూపొందించిన 'ఫైర్' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఉత్తరాఖండ్‌లోని వలసల వల్ల ప్రభావితమైన మున్సియారి అనే గ్రామంలోని వృద్ధ జంట నిజమైన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.  పద్మ సింగ్,  హీరా దేవి ఇద్దరు వృద్దులు ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. అయితే విడుదలకు ముందే  ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం..  తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. 

ఏకంగా 6 విభాగాల్లో 

స్పెయిన్  అంతర్జాతీయ చలనచిత్రోత్సవం '24th Imagine India International Film Festival' ఏకంగా 6 విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది.  ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, ఉత్తమ సంగీతం, ఉత్తమ ఫోటోగ్రఫీ దర్శకుడు,  ఉత్తమ సంగీత రూపకల్పన విభాగాలలో నామినేట్ చేయబడింది.

  • డైరెక్టర్  వినోద్ కాప్రి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు,  ఉత్తమ కథకు నామినేట్ అయ్యారు.
  • 'లైఫ్ ఆఫ్ పై'  ఫేమ్ కెనడియన్ సింగర్,  అకాడమీ అవార్డు గ్రహీత మైఖేల్ డన్నా ఉత్తమ సంగీతానికి నామినేట్ అయ్యారు.
  • మానస్ భట్టాచార్య ఉత్తమ DOPకి నామినేషన్ పొందగా, సౌస్తవ్ నస్కర్ ఉత్తమ సౌండ్ డిజైన్‌కు నామినేట్ అయ్యారు.

ఇదిఇలా ఉంటే ఇటీవలే 16వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కూడా  ప్రారంభ చిత్రంగా  'ఫైర్' ప్రదర్షింపబడింది.  

ఫిల్మ్ ఫెస్టివల్ ఉద్దేశ్యం?

24వ ఇమాజిన్ ఇండియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025 సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరగనుంది. భారతదేశం నుంచి వచ్చే చిత్రాలను ప్రదర్శించడం,  వాటిపై దృష్టిని ఆకర్షించడం  ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లక్ష్యం.  

latest-news | telugu-news | cinema-news 

Advertisment
Advertisment
Advertisment