/rtv/media/media_files/2026/03/13/govt-2026-03-13-20-14-09.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే ఉగాది కానుక అందించింది. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు అభిమానుల విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
10 రోజుల పాటు పెరిగిన ధరలు
ఈ అనుమతి ప్రకారం, సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రతి టికెట్‌పై రూ. 100, మల్టీప్లెక్సుల్లో రూ. 125 చొప్పున అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల చిత్ర యూనిట్‌కు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్ హంగామా
అంతేకాకుండా, ఈ నెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలు నిర్వహించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక షోలకు టికెట్ ధరను రూ. 500 గా ఖరారు చేశారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటుతో థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న పవన్ కల్యాణ్, హరీష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో
ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. రాశిఖన్నా కీ రోల్ ప్లే చేసింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. BGM మాత్రం తమన్ అందిస్తున్నారు.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రేపు విడుదల కానుంది. సినిమాపై హైప్ పెంచడానికి హరీష్ శంకర్ ఈ ట్రైలర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా కట్ చేసినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Follow Us