/rtv/media/media_files/2026/04/27/anushka-2026-04-27-10-39-50.jpg)
ఐపీఎల్ అంటే కేవలం సిక్సర్లు, ఫోర్ల హోరు మాత్రమే కాదు.. గ్యాలరీలో తారల మెరుపులు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణే. తాజాగా ఏప్రిల్ 24వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. గ్రౌండ్‌లో రజత్ పాటిదార్ నేతృత్వంలోని RCB జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధిస్తే, స్టాండ్స్‌లో అనుష్క తన ఫ్యాషన్ సెన్స్‌తో స్టైల్ విన్నర్ గా నిలిచారు.
ఇంతకు విషయం ఏంటంటే.. అనుష్క ఈ మ్యాచ్ కోసం సెజాన్ (Sezane) బ్రాండ్‌కు చెందిన వైట్ రఫుల్ స్లీవ్ టాప్‌ను ఎంచుకున్నారు. వి-నెక్లైన్, ఎంబ్రాయిడరీ వర్క్, స్లీవ్స్‌పై లేస్ డిజైన్‌తో ఉన్న ఈ టాప్ చాలా సింపుల్‌గా, ట్రెండీగా ఉంది. దీని ధర సుమారు 155 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 17,087. దీనికి తోడుగా క్లాసిక్ డెనిమ్ జీన్స్ ధరించి, మినిమల్ బ్రేస్‌లెట్లతో క్వైట్ లగ్జరీ స్టైల్‌ను ప్రదర్శించారు.
ఈ అవుట్‌ఫిట్ అంతా ఒకెత్తయితే, ఆమె చేతికి ఉన్న వాచ్ మరో ఎత్తు. అనుష్క ధరించిన వాచ్ పాంథర్ డి కార్టియర్ కలెక్షన్‌కు చెందినదిగా తెలుస్తోంది. 18 క్యారెట్ల ఎల్లో గోల్డ్‌తో తయారైన ఈ వాచ్‌లో బ్లూ సాఫైర్ సెట్ చేసిన క్రౌన్, బ్లూ-స్టీల్ హ్యాండ్స్ ఉన్నాయి. ఇండియాలో ఈ తరహా వాచ్‌ల ధరలు సుమారు రూ. 28 లక్షల నుంచి రూ. 61.5 లక్షల వరకు (డైమండ్స్ ఉన్న దాన్ని బట్టి) ఉంటాయని అంచనా.
నో-మేకప్ లుక్
మేకప్ విషయానికొస్తే అనుష్క ఎప్పటిలాగే నో-మేకప్ లుక్‌ను ఫాలో అయ్యారు. లైట్ పింక్ లిప్స్టిక్, సైడ్ పార్టెడ్ హెయిర్ స్టైల్‌తో చాలా ఫ్రెష్‌గా కనిపించారు. మొత్తానికి ఐపీఎల్ స్టాండ్స్‌ను ఒక ఫ్యాషన్ రన్‌వేగా మార్చేసి, తన స్టైల్‌తో మరోసారి అభిమానులను ఫిదా చేశారు అనుష్క శర్మ.
Follow Us