/rtv/media/media_files/2025/11/29/prabhas-spirit-2025-11-29-15-47-00.jpg)
Prabhas Spirit
Prabhas Spirit: సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) వరుసగా బాలీవుడ్‌లో కబీర్ సింగ్, యానిమల్ వంటి భారీ సినిమాలు తీశాక మరోసారి హిందీ నటులతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “స్పిరిట్” అతని తదుపరి ప్రాజెక్ట్. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ ఇప్పటికే ఫైనల్ అయ్యింది.
కొన్ని రోజుల క్రితం కరీనా కపూర్ కూడా స్పిరిట్‌లో కీలక పాత్రలో నటించబోతుందన్న వార్తలు బాగా హాట్ టాపిక్ అయ్యాయి. అయితే కరీనా స్వయంగా ఆ వార్తలను ఖండించి, “నేను స్పిరిట్‌లో లేను” అని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది.
స్పిరిట్‌లో కాజోల్? (Kajol in Spirit Movie)
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, సందీప్ రెడ్డి వంగా కాజోల్ ను కూడా ఒక ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించాడని టాక్. కథ విన్న కాజోల్ చాలా ఇంప్రెస్ అయి, ఈ పాత్ర చేయడానికి సిద్ధమైందన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు.
BUZZ 🚨:
— Movies4u Official (@Movies4u_Officl) November 29, 2025
Bollywood actress #Kajol is reportedly in talks to play an important role in #Prabhas and #SandeepReddyVanga’s #Spirit. pic.twitter.com/s5Cdxq4tSN
ఈ వార్త నిజమైతే, ఇది కాజోల్‌కు తొలి తెలుగు సినిమా అవుతుంది. ఆమె గతంలో కొన్ని తమిళ సినిమాల్లో నటించినా, ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. బాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్రస్థానంలో నిలిచిన కాజోల్‌కు సౌత్ ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. అందువల్ల ఆమె స్పిరిట్‌లో భాగమైతే సినిమాపై మరింత హైప్ వచ్చే అవకాశముంది.
Also Read: టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోన్నరేణు దేశాయ్..? లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!
సందీప్ రెడ్డి వంగా కథలో ప్రతి పాత్రకు బలమైన ప్రాధాన్యం ఇస్తాడన్న పేరున్నది. అతను రాసే పాత్రలు లోతైన భావోద్వేగాలు, బలమైన ప్రభావం కలిగి ఉండడం కారణంగా, కాజోల్ పాత్ర కూడా చాలా ముఖ్యం కానుంది. కథలో ఆమెను ఒక ముఖ్య పాయింట్‌గా చూపించవచ్చని సినీ వర్గాలు చర్చిస్తున్నాయి. కాజోల్ భర్త అజయ్ దేవ్‌గన్ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలోని RRR మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు కాజోల్ కూడా టాలీవుడ్‌లోకి అడుగుపెడితే ఇది పెద్ద చర్చ అవుతుందని చెప్పవచ్చు.
Also Read : రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' షాకింగ్ రన్‌టైమ్.. ఎన్ని గంటలంటే..?
స్పిరిట్‌లో ఇతర బాలీవుడ్ నటులు కూడా.. ప్రభాస్ బర్త్‌డే రోజు విడుదలైన స్పిరిట్ సౌండ్ వీడియోలో, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇప్పటికే ఈ సినిమాలో భాగమని ప్రకటించారు. ఇప్పుడు త్రిప్తి డిమ్రీ, కాజోల్ వంటి పేర్లు కూడా ఉండడంతో స్పిరిట్‌కు మంచి బాలీవుడ్ టచ్ వచ్చిందని చెప్పాలి.
సందీప్ రెడ్డి వంగా స్టైల్‌లో ఎమోషన్, యాక్షన్, ఉండటం వల్ల, సినిమా పాన్ ఇండియా స్థాయిలో బలంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ లాంటి స్టార్, టాప్ బాలీవుడ్ నటులు చేరడం ఇవన్నీ కలిసి స్పిరిట్‌పై భారీ అంచనాలు పెంచుతున్నాయి.
Follow Us