Anil Ravipudi: ఈ ఏడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ తో కలిసి హిట్టు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
Final script narration done & locked 📝☑️🔒
— Anil Ravipudi (@AnilRavipudi) March 26, 2025
చిరంజీవి గారికి నా కధ లో పాత్ర
“శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. 😄
He loved & enjoyed it thoroughly ❤️🔥
ఇంకెందుకు లేటు,
త్వరలో ముహూర్తంతో…
‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం 🥳#ChiruAnil
MegaStar @KChiruTweets garu…
Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్
మెగాస్టార్ సినిమాకు స్క్రిప్ట్ రాయడం పూర్తయినట్లు ట్వీట్ చేశారు. అలాగే ఇందులో చిరంజీవి పాత్రను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. “శంకర్ వరప్రసాద్” పాత్రలో మెగాస్టార్ కనిపించబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే పూజ కార్యక్రమాలతో సినిమాను మొదలు పెట్టనున్నట్లు వెల్లడించారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చిరంజీవితో తీసే మూవీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపారు. ‘గ్యాంగ్‌లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’ లో కనిపించిన చిరంజీవిని మళ్ళీ ఇప్పుడు చూస్తారు. మే చివరలో లేదా జూన్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
anil-ravipudi-movie-with-chiranjeevi | cinema-news | telugu-cinema-news
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్