/rtv/media/media_files/2025/02/14/6zG5Rk2kueEpWds7SbzQ.jpg)
roshan kanakala mowgli 2025 teaser released on valentines day
యంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల గతంలో ‘బబుల్ గమ్’ అనే సినిమాతో వచ్చి అందరినీ అలరించాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మరోక సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకున్న యంగెస్ట్ దర్శకుడు సందీప్ రాజ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రానికి ‘మోగ్లీ 2025’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కాంటెంపరరీ లవ్ స్టోరీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు.
Also Read:Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్ అంగీకారం!
అదిరిపోయే అప్డేట్
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో అత్యంత ఆసక్తికరంగా ఉంది. స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయనే చెప్పాలి.
Igniting the loudest war of a silent love story 💥❤️#Mowgli2025 shoot begins ✨
— Suma Kanakala (@ItsSumaKanakala) February 14, 2025
▶️ https://t.co/eRooGkp5US
Happy Valentine's Day 💓
A @SandeepRaaaj directorial.
🌟ing @RoshanKanakala & #SakshiMhadolkar
A @Kaalabhairava7 musical 🎵 #Mowgli@vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/QQ3bNNXFUC
Also Read: Fastag: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్!
అందులో రోషన్ కనకాల లుక్ అదిరిపోయింది. ఈ వీడియోలో మేకర్స్ మరో విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందుకు సంబంధించిన వీడియోను సుమ కనకాల తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు.