/rtv/media/media_files/2025/03/17/YVRCRkaE64itV2UCBck6.jpg)
యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శిల్పా చక్రవర్తి.యాంకరింగ్ తోనే కాకుండా సీరియల్, సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఓ టైమ్ లో అయితే సుమకు పోటీగా నిలిచింది. అయితే పెళ్లై, పిల్లలు పుట్టాక కొన్నాళ్ళు టీవీ షోలకు దూరంగా ఉన్న శిల్ప..మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 3 తో రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ వీడియోలో శిల్పా చక్రవర్తి తన బాధను వ్యక్తం చేస్తూ ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ తనమీద వచ్చిన ట్రోల్స్ తర్వాత మాట్లాడలేకపోయానంది. తాను ఏం చేశానని ఇలా తిడుతున్నారు అనుకున్నానని, ఆ ట్రోల్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి నాలుగు నెలలు పట్టిందని తెలిపింది. తనను మార్చడానికి తన భర్త చాలా ట్రై చేసారంది. తనకు తెలిసిన వాళ్ళే తనను నెగిటివ్ గా చూసారని.. బయటకు వెళ్లాలంటేనే భయం వేసిందని వెల్లడిచింది శిల్ప. అయితే అదే సమయానికి కరోనా రావడంతో తన భర్త బిజినెస్ ఆగిపోవడంతో తాను మరింత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని ఏడుస్తూ వాపోయింది.
హాస్పిటల్ బెడ్ మీదే
అలాగే తన తల్లి,తండ్రిల గురించి శిల్ప మాట్లాడుతూ.. కరోనా సమయంలోనే హాస్పిటల్ బెడ్ మీదే తన తండ్రి చనిపోయారని శిల్ప వెల్లడించింది. అది తనకు పెద్ద దెబ్బ తగిలిందని... దాంతో మరింత వీక్ అయిపోయానని వెల్లడించింది.దీంతో లైఫ్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందని తెలిపింది. కరోనా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా ఇంట్రెస్టు చూపించలేదని వెల్లడించింది. ఈ టైమ్ లోనే తన అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని.. ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు బాగుందని తెలిపింది. తనకు తెలిసిన వాళ్లే కొంతమంది నీకు అవకాశాలు రావట్లేదా, ఇంట్లోనే ఉంటున్నావా, హౌస్ వైఫ్ గా మారిపోయావా అని ఇష్టమొచ్చిన కామెంట్స్ చేసేవాళ్ళు అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం మళ్ళీ సీరియల్స్, టీవీ షోలు చేస్తూ బిజీ అవుతానని తెలిపింది.
Also Read : ఈ వారం ఓటీటీలో సినిమాల సందడే.. సందడే.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ కూడా..