/rtv/media/media_files/2026/05/11/rashmi-post-2026-05-11-14-58-20.jpg)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ అంశంపై సామాన్యులే కాకుండా సినీ ప్రముఖుల కూడా స్పందిస్తున్నారు. యాంకర్ రష్మీ, పూనమ్‌కౌర్, చిన్మయి సంచలన పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ నాయకుల వారసులు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోవాలని, మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదని పలువురు సెలబ్రిటీలు గట్టిగా గళం ఎత్తుతున్నారు.
యాంకర్ రష్మీ ఈ విషయంలో చాలా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. నేను బీజేపీకి, ప్రధాని మోదీకి మద్దతు ఇస్తాను. కానీ అది దేశం కోసం.. రేపిస్టులకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదు" అని ఆమె కుండబద్దలు కొట్టారు. తనను తిట్టడానికి సమయం వృధా చేయకుండా, బాధితులకు న్యాయం జరిగేలా పోరాడాలని ఆమె నెటిజన్లకు సూచించారు. అన్ని సమస్యలపై తాను ప్రత్యక్షంగా పోరాడలేనని, బాధితుల పట్ల సానుభూతి మాత్రమే చూపగలనని ఆమె నిజాయితీగా పేర్కొన్నారు.
లైంగిక వేధింపుల గొంతుకగా మారిన నటి చిన్మయి ఈ కేసును అంతర్జాతీయ స్థాయి వివాదాలతో పోల్చారు. అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ లాంటి వారు ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారంటూ ఆమె ట్వీట్ చేశారు. అధికారం అండతో లైంగిక వేధింపులకు పాల్పడే వ్యవస్థను ఆమె తన పోస్టు ద్వారా ఎండగట్టారు.
మరో నటి పూనమ్ కౌర్ నేరుగా రాజకీయ నాయకుల నైతికతను ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, వారి కుమారులు మహిళలపై దాడులు చేయడం ఎప్పుడు ఆపుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల కంటే సమాజంలో పలుకుబడి ఉన్నవారు మరింత బాధ్యతగా మెలగాలని, కానీ ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు కావడంతో విపక్షాలు దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. భగీరథ్‌కు వ్యతిరేకంగా పాత వీడియోలు, పోస్టులు మళ్లీ తెరపైకి రావడం అతనికి ఇబ్బందికరంగా మారింది.
17 ఏళ్ల బాలిక ఫిర్యాదు
హైదరాబాద్‌లోని పెట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో భగీరథ్‌పై 17 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. భగీరథ్ తనను లోబర్చుకుని, మద్యం తాగించి, నగర శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ బాలిక తన ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై పోలీసులు పోక్సో చట్టం (సెక్షన్లు 11, 12) తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలావుంటే.. పోక్సో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే, భగీరథ్ కూడా కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు బాలిక, ఆమె తల్లిదండ్రులు తనను హనీట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని భగీరథ్ పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో తప్పుడు కేసులు పెడతామని బెదిరించి మొదట రూ. 50,000 వసూలు చేశారని, ఆపై రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. రెండు వైపుల నుంచి ఫిర్యాదులు ఉండటంతో పోలీసులు రెండు కేసులను వేర్వేరుగా విచారిస్తున్నారు.
తాజాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతోందని డీజీపీ సి.వి. ఆనంద్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Follow Us