/rtv/media/media_files/2024/11/07/Ff4NaWyBnJZpLIaLZHqw.jpg)
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం 'అమరన్' దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 31 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా ఆరు రోజుల్లో రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ కు టాలీవుడ్ హీరో నితిన్ గెస్ట్ గా వచ్చారు. నితిన్ కు చెందిన శ్రేష్ట్ మూవీస్ బ్యానరే 'అమరన్' ను తెలుగులో రిలీజ్ చేసింది.
Also Read : అరుదైన రికార్డుకు చేరువలో అర్ష్‌దీప్.. భువీ రికార్డు బద్దలు కొడతాడా!
Awww Cute😍❤️Thalaivan Singing Telugu Song...❤️❤️The Smile nd happiness in his face...🥹🥹❤️@Siva_Kartikeyan #AmaranMajorSuccess pic.twitter.com/Gejz1EDClq
— 💙𝑽𝒂𝒊𝒔𝒉𝒖 𝑺𝑲 𝑻𝒉𝒂𝒏𝒈𝒂𝒄𝒉𝒊💙 (@Sri_VaishnaviSK) November 6, 2024
Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే
కాగా ఈ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ తెలుగులో పాట పాడి అలరించాడు. శివకార్తికేయన్ మాట్లాడుతూ..' 'అమరన్' సినిమాలో ముకుంద్ క్యారెక్టర్ చేయడానికి కారణం మా నాన్న. ఆయన పోలీసాఫీసర్. డ్యూటీలోనే మరణించారు. సినిమా రిలీజైనప్పటినుంచి నితిన్ ప్రతిరోజు కాల్ చేసి అప్‌డేట్స్ చెప్తూనే ఉన్నారు..' అని పేర్కొన్నాడు.
#Sivakarthikeyan𓃵 sings "Oo Priya .. Priyaa..." on stage 😍👌
— Movies4u Official (@Movies4u_Officl) November 6, 2024
📌 #Amaran Success meet pic.twitter.com/n9lOGCWrF1
Also Read : యంగ్ హీరోతో పెళ్లి కి రెడీ అయిన ప్రభాస్ హీరోయిన్..!?
నితిన్ ముందే..
అనంతరం నితిన్ సినిమాల్లో ఓ సాంగ్ తనకు చాలా ఇస్తామని చెబుతూ ఆ సాంగ్ ను నితిన్ ముందే తెలుగులో పాడి అదరగొట్టాడు.' ఓ ప్రియా ప్రియా.. తెలుసా నీకైనా'.. అంటూ నితిన్ 'ఇష్క్' సినిమాలోని పాటను రెండు లైన్లు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : 'భీమ్లా నాయక్' డైరెక్టర్ లాంచ్ చేసిన 'లగ్గం టైం' ఫస్ట్ లుక్..!