Allu Arjun: సంధ్యా థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అల్లు నిర్లక్ష్యం కారణంగానే ఒక కుటుంబం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బయట తొక్కిసలాట జరుగుతుందని పోలీసులు చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ సరిగ్గా స్పందించలేదని ఫైర్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా నెటిజన్లు భారీగా పోస్టులు పెడుతున్నారు. #alluarjunarrested హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మరో వైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి.. ఈ ఘటన ఓ యాక్సిడెంట్ అని, ఇందులో ఎవరి తప్పు లేదని వివరణ ఇచ్చారు. Also Read: దొరికిపోయిన అల్లు అర్జున్..జాతర సీన్ వరకు థియేటర్లోనే .. ఇదిగో ప్రూఫ్.. అన్ని అబద్దాలే ! అల్లు అర్జున్ VS రేవంత్ రెడ్డి తప్పెవరిది..? ఈ క్రమంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ సినిమా హల్లో ఎంత సేపు ఉన్నాడో? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఎప్పుడు థియేటర్ నుంచి బయటకు వెళ్ళాడు? తొక్కిసలాట ఏ టైంలో జరిగింది? ప్రతి ఫుటేజ్ ని ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సమాధానాలకు.. థియేటర్ దగ్గర ఆయన చేసిన వాటికి ఏ మాత్రం పొంతన లేదని.. అసలు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టేది లేకుండే అని అంటున్నారు. అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాట ఈ వీడియో రూపంలో తేట తెల్లం అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. Also Read: ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పో..సంచలన వీడియో బయటపెట్టిన బన్నీ ఫ్యాన్స్! అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టేది లేకుండే…అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాట ఈ వీడియో రూపంలో తేట తెల్లం అయ్యింది 🥲pic.twitter.com/DTXWfZ4gXs — Vennela Kishore Reddy (@kishoreddyK) December 21, 2024 Also Read: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!