Allu Arjun : ఫ్యాన్స్ కు క్షమాపణలు కోరిన అల్లు అర్జున్.. స్పీచ్ వైరల్

బిహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు. నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో నన్ను క్షమించండి. పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని అన్నారు.

New Update

సినీ లవర్స్ అండ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'పుష్ప 2' ట్రైలర్ కాసేపటిక్రితమే రిలీజ్ అయింది. ట్రైలర్ కాస్త సినిమాపై అంచనాలను పీక్స్ కు చేర్చింది. బిహార్‌లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్‌లో పుష్ప-2 ట్రైలర్‌ను విడుదల  చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు.

ఈ విషయంలో నన్ను క్షమించండి..

' బీహార్‌కు మొదటిసారి వచ్చా. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు. పుష్ప ఎప్పుడు తలవంచలేదు.. కానీ మొదటిసారి మీ ప్రేమకు తలవంచుతున్నా. మీరంతా ఎలా ఉన్నారు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫ్లవర్‌ కాదు  వైల్డ్ ఫైర్. నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో నన్ను క్షమించండి. 

Also Read : 'పుష్ప 2'.. ట్రైలర్ లోనే సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారుగా..!

పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. పుష్ప టీమ్‌ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈవెంట్‌కు సహకరించిన పోలీసులు, అభిమానులకు థ్యాంక్స్‌. 

డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రాబోతోంది. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా..' అంటూ బన్నీ తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఎత్తున  పాల్గొన్నారు.

Also Read : రాజమౌళి - మహేష్ సినిమాకు బిగ్ షాక్.. తప్పుకున్న స్టార్ టెక్నీషియన్?

Advertisment
Advertisment
తాజా కథనాలు