రికార్డు స్థాయిలో 'పుష్ప2' ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే 'పుష్ప2' ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.660 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అలాగే డిజిటల్, శాటిలైట్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి రూ.425 కోట్లకు అమ్ముడయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. By Anil Kumar 22 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2'. పార్ట్-1 భారీ విజయం సాధించడంతో 'పుష్ప2' పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ.350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీమ్ ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. 'పుష్ప2' వరల్డ్‌వైడ్‌గా రూ.1000 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్‌తో అరుదైన రికార్డును నమోదు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. #Pushpa2ThaRule - ₹1,065 Crores Pre Release business for India’s most awaited sequel!! pic.twitter.com/AhHara8jxu — Aakashavaani (@TheAakashavaani) October 21, 2024 Also Read : ఖైరతాబాద్ RTA ఆఫీస్ లో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న న్యూలుక్, ఆ సినిమా కోసమేనా? 'పుష్ప-2' థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.660 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు గరిష్టంగా రూ.220 కోట్లు కాగా.. ఈ సినిమా నార్త్ ఇండియా రైట్స్ రూ.200 కోట్లు, తమిళం రూ.50 కోట్లు, కర్ణాటకలో రూ.30 కోట్లు, కేరళలో రూ.20 కోట్లు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అటు ఓవర్సీస్ లో రూ.140 కోట్లకు అమ్మారు. డిజిటల్, శాటిలైట్ హక్కులతో సహా నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ. 425 కోట్లకు అమ్ముడయ్యాయి. #Pushpa2TheRule Pre Release BusinessAP/TS- 220 cr North- 200 crTamilNadu- 50 crKarnataka- 30 crKerala- 20 crOverseas- 120 cr Theatrical Rights- 640 crNetflix- 275 crMusic- 65 cr Satellite- 140 cr Non Theatrical Rights- 480 cr Total Pre release Business-1120 CR🔥 pic.twitter.com/FofWYmOE57 — Sumanth Bunny🐉🪓 (@AA_holicc) October 21, 2024 తొలి భారతీయ హీరోగా.. శాటిలైట్ హక్కుల కోసం రూ. 85 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ. 65 కోట్లు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డిజిటల్ రైట్స్ దాదాపు రూ. 275 కోట్లకు దక్కించుకుంది. అన్ని కలిపి ఈ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ. 1065 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగలేదు. ఇది కేవలం అల్లు అర్జున్ 'పుష్ప2' కు మాత్రమే సాధ్యమైంది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన తొలి భారతీయ హీరోగా అల్లు అర్జున్ అరుదైన ఘనత సాధించారు. Also Read : బిగ్ బాస్ షోలో గంగవ్వకు గుండెపోటుపై కీలక ప్రకటన #allu-arjun #pushpa-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి