KISSIK song Sreeleela
Sreeleela Kissik song: ఈ మధ్య సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ కోసం స్టార్ హీరోయిన్లను ఎంపిక చేయడం ట్రెండ్ అయ్యింది. దీని కోసం నిర్మాతలు కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లు ఒక్క సాంగ్ చేయడానికి కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా పుష్ప2 నుంచి విడుదలైన స్పషల్ సాంగ్ 'కిస్సిక్' కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంది.
Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!
ఈ ఒక్క పాట కోసం రూ. 2కోట్ల
శ్రీలీల కేవలం ఈ ఒక్క పాట కోసం రూ. 2కోట్ల పారితోషకం తీసుకుందట. ఈ సాంగ్ కోసం ఈ యంగ్ బ్యూటీ ఛార్జ్ చేసిన రెండు కోట్లు ఆమె మొత్తం సినిమా చేయడానికి తీసుకునే రెమ్యునరేషన్ తో సమానం. ఒక సినిమా చేస్తే వచ్చే డబ్బులు ఒక సాంగ్ తో సంపాదించేసింది. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలతో ఊపేసిన శ్రీలీల కెరీర్ ఇప్పుడు కాస్త డల్ అయ్యింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న పుష్ప2 శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయడం ఆమె కెరీర్ లో ఎంతో కీలకం అనే చెప్పాలి. ముందుగా ఈ సాంగ్ కోసం మేకర్స్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ని సంప్రదించారట. అయితే ఆమె ఈ ఒక్క సాంగ్ కోసం 6 కోట్లు డిమాండ్ చేయడంతో మేకర్స్ లైట్ తీసుకున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే పార్ట్ 1లో 'ఊ అంటావా మావ. ఊఊ అంటావా’ వరల్డ్ వైడ్ గా ఎంత పాపులరైందో తెలిసిందే. అప్పట్లో ఈ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. దీంతో పార్ట్2 ఐటమ్ సాంగ్ పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆదివారం విడుదలైన ఈ ‘కిస్సిక్’ సాంగ్ అభిమానులను కాస్త డిసప్పాయింట్ చేసింది. 'ఊ అంటావా మావ. ఊఊ అంటావా’ అంచనాలను రీచ్ కాలేకపోయింది.
Also Read: రిలీజైన 15 రోజులకే ఓటీటీలో నిఖిల్ సినిమా..మూవీ పేరేంటో తెలుసా..?
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
Also Read: రిలీజైన 15 రోజులకే ఓటీటీలో నిఖిల్ సినిమా..మూవీ పేరేంటో తెలుసా..?
Delhi CM: నా శరీరాన్ని దేశానికి అంకితం చేస్తున్నా.. ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన!
అక్షయ్ కుమార్ 'కేసరి చాప్టర్ 2' ప్రీమియర్ షో చూసిన తర్వాత ఢిల్లీ CM రేఖగుప్తా భావోద్వేగానికి గురయ్యారు. తన శరీరం, మనసు, జీవితం మొత్తాన్ని దేశానికి అంకితం చేస్తున్నానని అన్నారు. జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.
delhi cm rekha Gupta on kesari chapter 2
Delhi CM: కరణ్ ఎస్ త్యాగి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్' ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించగా.. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా హాజరయ్యారు. సినిమా చూసిన తర్వాత సీఎం రేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మాతృభూమి కోసం తన జీవితాన్ని, శరీరాన్ని, మనస్సును అంకితం చేయాలనుకుంటున్నాను అని ఎమోషనల్ అయ్యారు.
ఢిల్లీ సీఎం రేఖ భావోద్వేగం..
రేఖ గుప్తా ఇంకా మాట్లాడుతూ.. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగం చేసిన లక్షలాది మంది గురించి తెలిసేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఖచ్చితంగా అందరి హృదయాలను హత్తుకుంటుంది. మన కోసం జీవితాలు త్యాగం చేసిన ఎంతో మంది పేర్లు కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం మన మాతృభూమి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మాతృభూమి కోసం నేను నా జీవితాన్ని, శరీరాన్ని, మనస్సును అంకితం చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా హృదయం భావోద్వేగంతో నిండిపోయింది అని అన్నారు. రేఖా గుప్తాతో పాటు, హర్దీప్ పూరి, మంజిండియర్ సింగ్ సిర్సా, బన్సూరి స్వరాజ్, అనురాగ్ ఠాకూర్ వంటి అనేక మంది రాజకీయ నాయకులు ఈ చిత్రాన్ని వీక్షించారు.
BIG BREAKING: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ
Vizag Ansusha : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!
🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
Supreme Court: ఉర్దూ ఇండియాలోనే పుట్టింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు