Cinema:'పుష్ప2' ఖాతాలో మరో రికార్డ్.. ఆ ఒక్క చోటే 500 కోట్ల కలెక్షన్స్

'పుష్ప2' ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఈ మూవీ పది రోజుల్లోనే కేవలం హిందీ మార్కెట్‌లో రూ.507.50 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన చిత్రంగా 'పుష్ప2' రికార్డు సృష్టించింది.

New Update
pushpa2 (1)23

ప్రపంచవ్యాప్తంగా పుష్ప–2 మ్యానియా నడుస్తోంది. విడుదల అవ్వకముందు నుంచీ రికార్డ్‌లతో దూసుకెళుతున్న ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇక తాజాగా 'పుష్ప2' ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది.

Also Read: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

హిందీలోనే 500 కోట్లు..

 డిసెంబర్ 5 న విడుదలైన ఈ సినిమా 10 రోజుల్లో కేవలం హిందీ మార్కెట్‌ లోనే 507.50 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన చిత్రంగా 'పుష్ప2' రికార్డు సృష్టించింది. ఇక ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా తెలుపుతూ ‘పుష్ప 2 ది రూల్‌’ రికార్డుల పరంపర కొనసాగుతుండడంపై ఆనందం వ్యక్తం చేసింది. 

Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!

Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం

'పుష్ప2' పది రోజుల్లో ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.1292 కోట్లు ఉండగా.. అందులో సగం కలెక్షన్స్ హిందీ నుంచే ఉండటం విశేషం. దీన్ని బట్టి అల్లు అర్జున్ క్రేజ్ నార్త్ లో ఏ రేజ్ లో ఉందో, అక్కడి  ఆడియన్స్ 'పుష్ప2' ను ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో అర్థమవుతుంది. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

Also Read : 'బిగ్ బాస్- 8' గ్రాండ్ ఫినాలే ఈ రోజే.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు