/rtv/media/media_files/2024/11/18/96pt2ec0M5dPE9LIJIfw.jpg)
పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి చిన్న వయసులోనే తన మల్టీ టాలెంట్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. పవన్ వారసుడి మూవీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొద్ది రోజులుగా 'ఓజీ' మూవీతో అకీరా ఎంట్రీ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చాడు.
మ్యూజిషియన్‌గా అకీరా ఎంట్రీ..
'ఓజీ' అకీరా ఎంట్రీ నిజమేనని అన్నాడు. కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే.. అకీరా జీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేది యాక్టర్ గా కాదట.. మ్యుజీషియన్ గా.. తమన్ తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు. అందులో అకీరా గురించి మాట్లాడుతూ..' కీ బోర్డు ప్లే చేయడంలో అకీరా మాస్టర్. నేను త్వరలోనే 'ఓజీ' మ్యూజికల్ సెషన్స్‌కు అకీరాను పిలుస్తా. అకీరా వేళ్లు చాలా పొడవుగా ఉంటాయి.
Also Read: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం
Akira, with his large, skilled fingers, is a brilliant pianist. He worked with me for two months, and I’ll call him for the #OG - @MusicThaman 😍
— Nizam PawanKalyan FC™ (@NizamPKFC) November 16, 2024
Bring It On 🥵🔥 #Akiranandan Music & @PawanKalyan Screen presence 🥁🌋🎇 pic.twitter.com/pUzKckIWWQ
Also Read : కీరవాణి ఇంట పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు
అతడు పర్‌ఫెక్ట్ పియానిస్ట్‌గా కనిపిస్తాడు. అకీరా నాతో రెండు నెలలు పనిచేశాడు..' అని చెప్పుకొచ్చాడు. తమన్ మాటలను బట్టి చూస్తే 'OG' తో అకిరా మ్యూజిషియన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. కాగా 'OG' సినిమాకు సాహూ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేస్తుండగా.. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read : 'పుష్ప 2'.. ట్రైలర్ లోనే సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారుగా..!
Also Read : రాజమౌళి - మహేష్ సినిమాకు బిగ్ షాక్.. తప్పుకున్న స్టార్ టెక్నీషియన్?