/rtv/media/media_files/2026/03/28/lenin-2026-03-28-18-35-36.jpg)
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'లెనిన్' సినిమా విడుదల తేదీ మారింది. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా మే 1వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే, ఏప్రిల్ 30న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది విడుదలవుతోంది.
జూన్ 26న విడుదల
రామ్ చరణ్, అఖిల్ మధ్య ఉన్న మంచి స్నేహం, బాండింగ్ అందరికీ తెలిసిందే. అందుకే ఒకే సమయంలో రెండు పెద్ద సినిమాలు వచ్చి పోటీ పడటం కంటే, ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ నిర్ణయం తీసుకుంది. 'లెనిన్' సినిమాను జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
#LENIN will now arrive on June 26th, 2026. ❤️🔥#LeninOnJune26th@AkhilAkkineni8#BhagyashriBorse@iamnagarjuna@vamsi84@musicthaman@KishoreAbburu@NavinNooli@artkolla@leonbrittodp@pramodactor1@brindhagopal1@AnnapurnaStdios#ManamEnterprisesLLP@SitharaEnts@tseriessouthpic.twitter.com/EB9Y6c30Ip
— Annapurna Studios (@AnnapurnaStdios) March 28, 2026
"సినిమాను అత్యుత్తమంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని నిర్మాణ సంస్థ ఎక్స్ వేదికగా తెలిపింది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే భారతి అనే పాత్రలో నటిస్తోంది. మొదట శ్రీలీల హీరోయిన్ అనుకున్నప్పటికీ, డేట్స్ కుదరక ఆమె స్థానంలో భాగ్యశ్రీ వచ్చింది.ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Follow Us