'సంక్రాంతికి వస్తున్నాం' లో హీరోయిన్ రోల్ ను అంతమంది రిజెక్ట్ చేశారా?

‘సంక్రాతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నారు ఐశ్వర్య రాజేష్. అయితే ఆమె కన్నా ముందు ఆ రోల్ ను ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారని, నలుగురి పిల్లల తల్లి పాత్ర కావడంతోనే వాళ్లు నో చెప్పినట్లు తెలిపారు.

New Update
sSankranthiki vasthunnam

aishwarya rajesh venkatesh meenakshi chowdary

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘సంక్రాతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి క్యూ కడుతున్నారు. దీంతో  కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజే రూ.45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేష్.. తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే

" నిజానికి ఆ పాత్ర నా దగ్గరికి వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ముందే నాతో చెప్పారు. నలుగురి పిల్లల తల్లి పాత్ర కావడంతోనే వాళ్లు రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. అది పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకడం నా భాగ్యం. 

కచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్లు బాధపడతారు.." అంటూ చెప్పింది. అయితే ఈరోల్ ను మిస్ చేసుకున్న ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరనేది మాత్రం ఐశ్వర్య రాజేష్ రివీల్ చేయలేదు. కాగా ఐశ్వర్య రాజేష్ తో పాటూ మీనాక్షి చౌదరి ఇందులో మరో హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె వెంకీమామ ఎక్స్ లవర్ గా పవర్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది.

Also Read : వందకోట్ల క్లబ్ లో చేరిన 'డాకు మహారాజ్'.. సంక్రాంతి విన్నర్ గా బాలయ్య

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు