/rtv/media/media_files/2025/03/23/qnFTbT1vNveDFGqhGtNU.jpg)
actress Gayatri Bhargavi about fake thumbnail
Gayatri Bhargavi: ఈ మధ్య ఫేక్ థంబ్‌నెయిల్స్ పెట్టే బ్యాచ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఫేక్ థంబ్‌నెయిల్స్‌తో వ్యూస్ తెచ్చుకోవడం కోసం ఎంత నీచానికైనా తెగపడుతున్నారు కొందరు. బతుకు-చావు అనే సున్నితమైన అంశాలను కూడా పట్టించుకోవడంలేదు. యాంకర్ భార్గవీ కుటుంబం ఇప్పుడు ఇదే ఫేక్ థంబ్‌నెయిల్స్ కారణంగా మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ఆమె భర్త చనిపోయినట్టుగా ఓ యూట్యూబ్ ఛానెల్ థంబ్‌నెయిల్ పెట్టడంపై భార్గవి అసహనం వ్యక్తం చేశారు. ఇంతకీ దీని గురించి భార్గవీ ఏం అన్నారంటే..?
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
యాంకర్ గాయత్రి @iDreamMedia కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ చేసింది యాంకర్ స్వప్న
— 🪷🪷హైందవి రెడ్డి 🪷🪷BJP Parivar (@HyndaviPandem) March 23, 2025
గాయత్రి భర్త ఒక ఆర్మీ ఆఫీసర్ వారికి జరిగిన ఒక సంఘటన ఇంటర్వ్యూ లో చెపితే సదరు మీడియా ఛానల్ ఎంత ఘోరంగా Thumbnail పెట్టారో చూడండి @adgpi pic.twitter.com/3ly8eaP5FU
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
భార్గవీ ఏం అన్నారంటే..
అయితే నటి భార్గవి గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారట. అందులో భార్గవి.. తన భర్త ఒక ఆర్మీ జవాన్ అని చెబుతూ.. తమకు జరిగిన ఒక సంఘటనను పంచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారట. దాన్ని ఓ యూట్యూబ్ ఛానెల్ తన భర్త చనిపోయినట్లు థంబ్ నెయిల్ ప్రచారం చేస్తుందని వాపోయారు. ఇలాంటివి ఎలా చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. సదరు ఛానెల్ దీనికి సమాధానం చెప్పాలని, బహిరంగంగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టాలో పంచుకున్నారు.
telugu-news | cinema-news | telugu-cinema-news
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్