Udaybir Sandhu : త్రివిక్రమ్ సినిమాలో విలన్గా ధురంధర్ 2 నటుడు!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' (AK 47) లో ఆయన విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

New Update
trivikram

బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ధురంధర్ 2లో తన నటనతో మెప్పించిన పంజాబీ నటుడు ఉదయ్‌బీర్ సంధు ఇప్పుడు టాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' (AK 47) లో ఆయన విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ అప్‌డేట్‌కు సంబంధించి ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ధురంధర్ 2'లో రణవీర్ సింగ్‌కు స్నేహితుడిగా, ఆపై డ్రగ్ లార్డ్‌గా 'పిందా' పాత్రలో ఉదయ్‌బీర్ కనబరిచిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాలో ఆయన చెప్పిన ఘర్ కీ యాద్ నహీ ఆయీ జస్సీ అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

పంజాబ్‌కు చెందిన ఉదయ్‌బీర్ సంధు జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు. 2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఆ తర్వాత 'అమర్ సింగ్ చమ్కీలా'లోనూ నటించారు. అయితే 'ధురంధర్ 2' ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ పాత్ర కోసం ఆయన ఏకంగా 15 కిలోల బరువు పెరిగి, ఆ తర్వాత తగ్గడం గమనార్హం. ఆయనలోని డెడికేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి త్రివిక్రమ్ ఈ కీలక పాత్రకు ఆయనే సరైన వ్యక్తని భావించినట్లు తెలుస్తోంది.

శ్రీనిధి శెట్టి కథానాయికగా

వెంకటేష్ కెరీర్‌లో 77వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. గతంలో వెంకటేష్ సూపర్ హిట్ చిత్రాలైన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వాసు  సినిమాలకు త్రివిక్రమ్ మాటలు అందించారు. కానీ, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రాన్ని 2026 వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. పంజాబీ గడ్డపై తన సత్తా చాటిన ఉదయ్‌బీర్, ఇప్పుడు టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్‌ను ఎలా ఢీకొంటాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు