'పవన్ కళ్యాణ్‌కు ఇది చెప్పాలనుకుంటున్నా'? షాయాజీ షిండే కామెంట్స్ బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్ లో గెస్టుగా హాజరైన నటుడు షాయాజీ షిండే పర్యావరణ పరిరక్షణ పై తన ఆలోచనలు పంచుకున్నారు. గుడిలో ప్రసాదంతో పాటు మొక్కను కూడా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. By Archana 07 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update pawan kalyan షేర్ చేయండి Sayaji Shinde : హీరో సుదీర్ బాబు, షాయాజీ షిండే, సాయి చాంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'. ఈ మూవీలో షాయాజీ షిండే సుదీర్ బాబు తండ్రి పాత్రలో నటించారు. వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై అభిలాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హీరో సుదీర్ బాబు, షాయాజీ షిండే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో పాల్గొని మూవీ గురించి ప్రమోట్ చేశారు. Also Read: దసరా కానుకగా ఓటీటీలో అక్షయ్ కుమార్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే? ఈ మాట పవన్ కళ్యాణ్ కు చెప్తాను.. ఈ క్రమంలో నటుడు షాయాజీ షిండే పర్యావరణ పరిరక్షణ పై తన ఆలోచనలను పంచుకున్నారు. గుడిలో ప్రసాదంతో పాటు మొక్కను కూడా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో మూడు ఆలయాల్లో తాను ఈ విధానం ప్రారంభించినట్లు తెలిపారు. ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో సుమారు 100, 200 మందికి ప్రసాదంలాగా మొక్కలను ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ ఇస్తే తన ఆలోచనను ఆయనతో పంచుకుంటానని అన్నారు. మొక్కలు నాటితే పెరిగి చెట్లవుతాయి.. తర్వాత ఏడు జన్మలకు అవి ఉపయోగకరంగా ఉంటాయని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీంతో నాగార్జున షాయాజీ షిండే ఆలోచనను మెచ్చుకున్నారు. ఆయన అభిమానులు ఈ విషయాన్ని తప్పకుండా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. Also Read: ఎమోషనల్ గా 'మా నాన్న సూపర్ హీరో' ట్రైలర్ #pawan-kalyan #tollywood #sayaji-shinde మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి