Ram Charan : బూమ్రాకు రామ్ చరణ్ సారీ.. అలా అనకుండా ఉండాల్సిందంటూ ట్వీట్!

స్టార్ హీరో రామ్ చరణ్ భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. పొరపాటున బూమ్రాను ఫుట్‌బాలర్ అని పిలవడంతో రామ్ చరణ్ క్షమాపణలు చెప్పారు.

New Update
ram charan

స్టార్ హీరో రామ్ చరణ్ భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. పొరపాటున బూమ్రాను ఫుట్‌బాలర్ అని పిలవడంతో రామ్ చరణ్ క్షమాపణలు చెప్పారు. భోపాల్‌లో జరిగిన పెద్ది సినిమా గ్రాండ్ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌లో  మాట్లాడిన రామ్ చరణ్‌కు భారత క్రికెటర్ల గురించి కొన్ని మాటల్లో చెప్పాలని కోరారు. అందులో ఆయన సచిన్ టెండూల్కర్ కెరీర్‌ను లాంగ్ లెజెండరీ రన్ అని, ధోనీని కామ్ అండ్ కూల్ అని, విరాట్ కోహ్లీని ఫైర్ అని అభివర్ణించారు. అలాగే రోహిత్ శర్మ గురించి చెబుతూ "ఆయన అందరి వాడు" అని కొనియాడారు. అయితే బూమ్రా వంతు వచ్చేసరికి క్రికెట్‌కు బదులు ఫుట్‌బాల్‌తో కన్ఫ్యూజ్ అయ్యారు. రామ్ చరణ్ చేసిన ఈ చిన్న పొరపాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, అభిమానులు దీనిపై రకరకాలుగా కామెంట్లు చేస్తూ మీమ్స్ క్రియేట్ చేశారు.

బూమ్రాకు సారీ

ఈ విషయంపై రామ్ చరణ్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా బూమ్రాకు సారీ చెప్పారు. ఒక్కోసారి తనకు పేర్లు సరిగ్గా గుర్తుండవని, బూమ్రాను అలా పిలవడం పొరపాటేనని అంగీకరించారు. అక్కడ ఉన్న హడావుడి, జనం మధ్యలో తెలియకుండా జరిగిపోయిన మానవ తప్పిదమిదని పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు బూమ్రా అంటే ఎంతో గౌరవమని, ఆయన ఆటకు తాను పెద్ద అభిమానినని రామ్ చరణ్ స్పష్టం చేశారు.

మరోవైపు ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తగిలిన చిన్న గాయం కారణంగానే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బూమ్రా తన పాత ఫామ్, పదునైన బౌలింగ్‌ను ప్రదర్శించలేకపోతున్నాడని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే వెల్లడించారు. ముంబై ఇండియన్స్ జట్టు బూమ్రా కోలుకోవడానికి తగినంత సమయం ఇచ్చినప్పటికీ ఆయన అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయాడు. 32 ఏళ్ల బూమ్రా ఈ ఐపీఎల్ 2026 ప్రారంభంలో ఒక చిన్న గాయంతో ఇబ్బంది పడ్డాడని, అందుకే ఈ సీజన్‌లో ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసుకోగలిగాడని జయవర్ధనే తెలిపాడు. 

Advertisment
తాజా కథనాలు