గాయని ప్రవస్తి పాడుతా తీయగా షోలోని జడ్జిలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారికి నచ్చిన వారికే ప్రోగ్రాంలో ఎంకరేజ్ చేస్తారని మిగతా వారిని తొక్కేస్తారని సింగర్ ప్రవస్తి కామెంట్లు చేసింది. అలాగే తనని బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. అయితే దీనికి సింగర్ సునీత స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!
ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ
కీరవాణి అందించిన పాటను..
ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రవస్తి గురించి డైరెక్ట్‌గా కాకుండా.. లిరిక్స్‌ను షేర్ చేశారు. గోపీచంద్ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన పాటను ఆమెను షేర్ చేశారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్ పాటను షేర్ చేశారు. అయితే సునతీ సింగర్ ప్రవస్తి గురించే పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు
ఇదిలా ఉండగా పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో చాలా మంది సింగర్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే ఈ షోలో జడ్జెస్‌గా సునీత, కీరవాణి, చంద్రబోస్‌లపై గాయని ప్రవస్తి ఆరోపణలు చేసింది. జడ్జిమెంట్ విషయంలో వివక్ష చూపుతున్నారని, కొందరు పాడకపోయినా కూడా సపోర్ట్ చేస్తూ.. చివరి వరకు తీసుకువచ్చారని తెలిపింది. దీనిపై సింగర్ సునీత కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా పలుమార్లు విమర్శలు చేయడంతో ఈ వీడియోను షేర్ చేశారు.
ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన