Actor Prudhvi: నన్ను క్షమించండి బాబోయ్.. వెనక్కి తగ్గిన పృథ్వీ!

నటుడు పృథ్వీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగతంగా తనకు ఎవ్వరి మీద ద్వేషం లేదని అన్నారు. ఇకపై ‘బాయ్ కాట్ లైలా’ అనకుండా వెల్కమ్ లైలా అనండి అంటూ ఆయన కోరారు.

New Update
actor prudhvi apology to ycp fans in laila pre release event controversial comments

actor prudhvi apology to ycp fans in laila pre release event controversial comments

‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్ నెట్టింట దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నాయకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. అయితే తాజాగా ఈ విషయమై నటుడు పృథ్వీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. 

ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

వ్యక్తిగతంగా తనకు ఎవ్వరి మీద ద్వేషం లేదని.. తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెపుతున్నాను అన్నారు. ఇకనుంచి ‘బాయ్ కాట్ లైలా’ అనకుండా వెల్కమ్ లైలా అనండి అంటూ పృథ్వీ పేర్కొన్నారు. లైలా సినిమా ఫలక్ నామాదాస్ కంటే పెద్ద హిట్ కావాలి అని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్‌ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్‌

క్షమాపణలు కోరుతున్నా

సినిమాని కిల్ చేయొద్దని.. సినిమాని ప్రేమిద్దాం అని అన్నారు. మనకు ఇంత క్రేజ్ వచ్చిందంటే అది సినిమాలనుంచే అని అన్నారు. కాబట్టి తన వల్ల సినిమా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన మాటలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వారందరికీ క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. 

ఇది కూడా చదవండి:  ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌

ఇంతటితో ఈ విషయానికి ముగింపు పలకండని అన్నారు. సినిమాకి ఇబ్బంది పెట్టకూడదనే కారణంతో ఈ వీడియో చేశానని అన్నారు. ఇంకో విషయం ఏంటంటే.. తన తల్లి గురించి చాలా మాట్లాడారని.. అలా అనడం తప్పని అన్నారు. తల్లిని దూషిస్తే ఎలాంటి వారి నోటునుంచైనా బూతులు తప్ప మరేవి రావని ఆయన అన్నారు. అయినా తన తల్లిని తిట్టిన వారిని అస్సలు వదిలి పెట్టనని అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇప్పటికైనా సోషల్ మీడియాలో పృథ్వీపై నెగెటివ్ కామెంట్స్‌కు చెక్ పడుతుందో లేదో చూడాలి.

పృథ్వీ ఏమన్నాడంటే?

లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడుతూ.. ఇన్ డైరెక్ట్ గా వైసీపీపై సెటైర్లు వేశారు. ఒక వ్యక్తిని మేకల మంద దగ్గరకు తీసుకెళ్లి ఎన్ని ఉన్నాయ్ రా అని అడిగితే.. మొత్తం 150 మేకలు ఉన్నాయని.. ఇక సినిమా అయిపోయే ముందు మరో సీన్ లో కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయని వ్యంగ్యంగా మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వైసీపీ ఫ్యాన్స్ ‘‘బాయ్ కట్ లైలా’’ అనే ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఇది చూసి విశ్వక్ అండ్ మూవీ టీం దీనిపై స్పందించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు