కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని నాగచైతన్య కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందించారు. ఈ అంశంపై ఆయన డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా.. నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండంటూ నాగార్జున ట్వీట్ చేశారు. By V.J Reddy 02 Oct 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి Naga Chaitanya: కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య స్పందించారు. ఈ అంశంపై ఆయన డైరెక్ట్ గా మాట్లాడకపోయినా.. తండ్రి నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండంటూ నాగార్జున ట్వీట్ చేశారు. వద్దు అండి.. ప్లీజ్.. కేటీఆర్ వల్లే నటి సమంత, నాగచైతన్యకు విడాకులు అయ్యాయని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున స్పందించారు. దయచేసి రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగొద్దని కోరారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని అన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి అని చెప్పారు. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని అన్నారు. తక్షణమే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలని మంత్రి కొండా సురేఖను కోరారు. సమంత స్పందన... కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందించింది. విడాకులు నా వ్యక్తిగత విషయమని.. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని పేర్కొంది. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. '' ఒక మహిళగా బయటికి వచ్చి, గ్లామరస్ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా సాహసం, శక్తి అవసరం. కొండా సురేఖ గారు.. నా జీవిత ప్రయాణంపై నేను గర్వపడుతున్నాను. దీన్ని చిన్న చూపు చూడకండి. ఒక మంత్రిగా మీ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయని మీరు గ్రహిస్తారని భావిస్తున్నాను. వ్యక్తుల ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. నా విడాకులు అనేవి వ్యక్తిగత విషయం. ఈ విషయం పట్ల దూరంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే మా విడాకులు జరిగాయి. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. రాజకీయాల నుంచి నా పేరు దూరంగా ఉంచండి. నేనెప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటా. అలాగే ఉండటం కొనసాగిస్తానని'' సమంత తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. #ktr #konda-surekha #actress-samantha #naga-chaitanya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి