/rtv/media/media_files/2026/04/21/anasuya-2026-04-21-08-24-12.jpg)
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా అల్వాలకు చెందిన చంటి అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
గతేడాది డిసెంబర్ 23 నుంచి నిందితుడు చంటి, ఇన్‌స్టాగ్రామ్‌లో @chantidhorapally అనే అకౌంట్ ద్వారా అనసూయను టార్గెట్ చేశాడు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా అభ్యంతరకరమైన పోస్టులు, కామెంట్లు పెట్టడం మొదలుపెట్టాడు. ఇది మరీ శ్రుతి మించడంతో, తనను వేధిస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనసూయ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. టెక్నాలజీ సాయంతో ఆ ఇన్‌స్టా అకౌంట్ ఎవరిదో కనిపెట్టారు. విచారణలో ఆ వ్యక్తి నల్గొండ జిల్లాకు చెందిన చంటి అని తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు చంటిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినా లేదా అసభ్యకర పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన ద్వారా పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు. చంటిపై బీఎన్ఎస్ యాక్ట్, సెక్షన్ 75, 79, 336 (4), 351, 356 తోపాటు ఐటీ యాక్ట్ సెక్షన్ 66ఈ, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
గత కొద్దికాలంగా అనసూయ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ సినిమా ఇష్యూలో గానీ, ఇటీవల శివాజీతో జరిగిన కాంట్రవర్సీ సమయంలో గానీ నెటిజన్లు, కొందరు హీరోల ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేసి ఘాటుగా విమర్శలు చేశారు. అయితే అనసూయ కూడా వారికి ఏమాత్రం తగ్గకుండా ధీటుగా సమాధానం ఇస్తూ రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాటల యుద్ధం సాగుతూ వచ్చింది.
Follow Us