సినిమాలకు గుడ్ బై చెప్పిన 12th ఫెయిల్ హీరో.. షాకింగ్ పోస్ట్!

'12th ఫెయిల్' ఫేమ్ విక్రాంత్ మాస్సే సోషల్ మీడియా పోస్ట్ అతని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపై సినిమాలు చేయబోను అంటూ విరామం ప్రకటించారు. 2025లో చివరిగా తెరపై కనిపించనున్నట్లు పోస్టులో తెలిపారు.

New Update

విక్రాంత్ మాస్సే రిటైర్మెంట్ 

ఇలా వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న నటుడు విక్రాంత్..  తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపై సినిమాలు చేయబోను అంటూ విరామం ప్రకటించారు. 2025లో చివరిగా తెరపై కనిపించనున్నట్లు పోస్టులో తెలిపారు.   'గత కొన్ని సంవత్సరాలుగా మీరు నాకు అందించిన మద్దతుకు మీ అందరికీ ధన్యవాదాలు. 2025లో నన్ను చివరిసారిగా తెరపై చూడబోతున్నారు. నా గత రెండు చిత్రాలు జీవితంలో మనోహరమైన జ్ఞాపకాలు'' అంటూ పోస్ట్ పెట్టారు. 

విక్రాంత్ మాస్సే సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  2013లో ..  నటుడు రణవీర్ సింగ్,  సోనాక్షి సిన్హా 'లూటేరా'సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో విక్రాంత్ సపోర్టింగ్ రోల్‌ చేశాడు. ఆ తర్వాత  'ఛపాక్', 'హసీన్ దిల్రూబా', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా', 'సెక్టార్ 36', 12th ఫెయిల్ వంటి సినిమాల్లో నటించాడు. 

Also Read: Aviation : 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు