Chandrababu Inner Ring Road Case :ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటీషన్ దాఖలు చేసింది సిఐడి. ఈ కేసులో కొత్తగా మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావు లను నిందితులుగా పేర్కొన్నారు.

New Update
AP Skill Case: ఏపీ స్కిల్ కేసులో మరో ట్విస్ట్.. ఆ 12 మంది ఐఏఎస్ లకు ఉచ్చు?

Chandrababu Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  సీఐడీ (CID) మరో పిటిషన్ దాఖలు చేసింది. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావు లను నిందితులుగా ఇందులో చేర్చారు.వీరి పై ఐపిసి 120బి, 409, 420, 34,35 37, 166, 167 రెడ్ విత్ 13(2) పి.ఒ.సి చట్టంలోని 13(1)(సి)(డి) సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఈ పిటీషన్ ను సీఐడీ విజయవాడ ఎసిబి కోర్టు లో దాఖలు చేసింది.

సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదనలు..

మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ (Chandrababu Quash Petition) మీద వాదనలు జరగుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (AP Skill Development Case) చంద్రబాబు వేసిన కేసును కొట్టేయాలంటూ బాబు తరుఫు న్యాయవాదులు హరీష్ సాల్వే (Harish salve), సిద్ధార్ధ లుథ్రా (Sidharth Luthra), మను సింఘ్వీలు (Manu Singhvi) వాదిస్తున్నారు. సెప్టెంబర్ 19న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20న కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ముందుంచింది. అంటే ఒకరోజు తర్వాత వాటిని కోర్టు ముందు పెట్టిందని తన వాదన వినిపించారు హరీష్ సాల్వే. అలాగే 2018లో నేరం జరిగిందన్న వివరాలేవీ రిమాండ్ రిపోర్ట్ లో చెప్పలేదు. 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే రిమాండ్ రిపోర్ట్ ఉందని ఆయన చెప్పారు. దీని ఆధారంగా ఈ కేసుకు ఏ17 వర్తిస్తుందని హరీష్ వాదనలు వినిపించారు.

2018లోనే ఈ కేసు విచారణ ప్రారఃబమైందని ఏపీ ప్రభుత్వం తరుపు లాయర్ ముకుల్ రోహ్గతీ వాదించారు. అయితే చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే ఈ వాదన సహేతుకం కాదని అన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన వాదన ఆయన చెబుతున్నది కాదని చెప్పారు. గతంలో ఇంకేదో విచారణ చేశారని...దానిని మూసేసారని తెలిసారు. ఉదయం మొదలైన ఈ వాదనలు కొంతసేపు అయ్యాక మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. ఇప్పుడు భోజన విరామం తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి.

Also Read:మార్చి-ఏప్రిల్లో ఎన్నికలు, ఫిబ్రవరిలో వైసీపీ మ్యానిఫెస్టో

చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

Advertisment
Advertisment
తాజా కథనాలు