CI Srinivas : బొల్లారంలో తప్ప తాగి సీఐ శ్రీనివాస్‌ వీరంగం

తప్ప తాగి వాళ్లును కాంట్రోల్‌ చేయాల్సిన పోలీసులే మద్యం తాగి కంట్రోల్‌ తప్పుతున్నారు. సీఐ శ్రీనివాస్‌ చేసిన పనికి పోలీస్‌ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. అన్ని స్టేషన్లను కంట్రోల్‌ చేసే కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సీఐగా పని చేసే ఓ అధికారి కంట్రోల్‌ తప్పి ఓ వాహనాన్ని ఢీ కొట్టారు.

New Update
CI Srinivas : బొల్లారంలో తప్ప తాగి సీఐ శ్రీనివాస్‌ వీరంగం

CI Srinivas: మద్యం మత్తులో..

తాగుబోతు సీఐ బొల్లారం ( Bollaram) పోలీస్ స్టేషన్ పరిధిలో వీరంగం చేశారు. మద్యం మత్తులో రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చేశారు. బోయినపల్లి మార్కెట్‌కి కూరగాయల లోడ్‌తో వెళ్తున్న వాహాన్ని ఢీకొట్టారు సీఐ శ్రీనివాస్ ( CI Srinivas). ఈ ప్రమాదంలో కూరగాయల వ్యాన్‌ డ్రైవర్ శ్రీధర్‌ ( Sridhar) తీవ్రగా గాయపడ్డారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాన్వాయ్‌తో సీఐ వచ్చినట్లు సమాచారం.

Drunk CI Srinivas Veeranga except in Bollaram

ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు

హైదరాబాద్ (Hyderabad) బొల్లారంలో తప్ప తాగి ఓ సీఐ వీరంగం సృష్టించారు. పట్టపగలే తప్ప తాగి రోడ్డు ప్రమాదం చేశారు ఓ పోలీస్‌ అధికారి. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ మద్యం మత్తులో కూరగాయల లోడుతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. అయితే సీఐకి చేసిన బ్రీత్‌ అనలైజర్ టెస్ట్‌లో  ( Breath alyzer Test) 201 రీడింగ్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో సీఐపై కేసు నమోదు చేశారు బొల్లారం పోలీసులు (Bollaram Police) . ఈ సీఐ డీఎస్పీ ప్రమోషన్‌ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం అతను లీవ్‌లో ఉన్నట్లు సమచారం. అంతే కాకుండా సీఐ శ్రీనివాస్‌ వాహనంపై ఆరు ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు ( Traffic violation cases) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

డ్రైంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన సీఐ

నిన్న రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టెస్టులో మాములు వాళ్లను పట్టుకోవాల్సింది పోయి.. పోలీసులే ఇలా తప్ప తాగి డ్రైవ్‌ చేస్తున్నారు. ఇలా చేస్తే ఇక మాములువాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శ్రీనివాస్‌ వాహనాన్ని వేగంగా నడపడంతో కూరగాయాల వ్యాన్‌ను ఢీకొట్టిందని అక్కడ ఉన్న బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన శ్రీధర్‌ ను దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రి ( government hospital)కి తరలించారు పోలీసులు. అంతేకాకుండా అతని వాహానం నుజ్జునుజ్జు అయింది. ఇక ఈ ప్రమాదానికి గురైన సీఐ కారు- వ్యాన్‌ను బొల్లారం పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: చంద్రయాన్-3 చుట్టూ ఫేక్ వీడియోలు చక్కర్లు..అసలు నిజం ఇదే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు