AP Politics: జానీ గూటికి జానీ మాస్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీ అభ్యర్థిగా నెల్లూరు టికెట్ రేసులో ఉన్నారా ? ప్రస్తుతం జానీ మాస్టర్ అంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది.

New Update
AP Politics: జానీ గూటికి జానీ మాస్టర్

Choreographer Jani Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.తన స్టెప్పులతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా ? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.. అదికూడా జనసేన పార్టీ అబ్యర్ధిగా పోటీ చేస్తున్నారనే న్యూస్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయింది. ఇంతకీ.. జానీ మాస్టర్ నిజంగా పోటీ చేస్తున్నారా ? ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు? ఈ వార్తకు బలం చేకూరే రాజకీయ పరిణామాలేంటి ? పూర్తి వివరాల్లోకి వెళితే ..

నెల్లూరు నుంచే జనసేన అభ్యర్థిగా రేసులో ఉన్నారా ?

మొన్నటి వరకు తెలంగాణా ఎన్నికల సంగ్రామం నడిచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటూనే ఉంది. ఏ ఏ స్థానాలనుంచి ఎవరు పోటీ చేస్తున్నారనే విషయాల పట్ల కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే జానీ మాస్టర్ స్వస్థలం నెల్లూరు నుంచే జనసేన అభ్యర్థిగా రేసులో దిగుతున్నారని సమాచారం.

సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ చురుకుగా ..

ఢీ షో నుంచి వచ్చి భారతీయ సినిమాను తన డ్యాన్సులతో ఉర్రుతలూగించిన జానీ మాస్టర్ కేవలం సినిమా రణగంలోనే కాకుండా సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ ముందుంటారు. నెల్లూరు ఎప్పుడు వచ్చినా సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కాపు సామజిక వర్గ నేతలను కలుస్తూ ఉంటారు. అయితే ఇన్నాళ్లు వార్తల్లోకి రాని మాస్టర్ ఇప్పుడే ఎందుకు హాట్ టాపిక్ అయ్యారంటే ..

అంగన్వాడీ ధర్నాకు మద్దతు

ఇటీవల నెల్లూరులో జరిగిన అంగన్వాడీల ధర్నాలో జానీ మాస్టర్ పాల్గొని వారి పోరాటానికి మద్దతు తెలిపారు.
అంగన్వాడి కార్యకర్తల పోరాటంలో అసువులు బాసిన రమణమ్మ అనే కార్యకర్త కుటుంబానికి జానీ మాస్టర్ రూ.70 వేలు ఆర్థిక సాయం అందజేశారు.తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం చేస్తున్న ఆందోళనలో పాల్గొని మానసిక ఒత్తిడితో అంగన్వాడీ కార్యకర్త చనిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో తిరిగి పునరావృతం కాకూడదని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

publive-image

జానీ మాస్టర్ దారెటు ..

2024 ఎన్నికల్లో జానీ మాస్టర్ పోటీ చేస్తారా? అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా.. ‘తెలీదు సార్. నుదుటి మీద ఎలా రాసుంటే అలా జరుగుతుంది’ అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మద్దతు ఏ పార్టీకి ఇస్తున్నారు? అని మరో రిపోర్టర్ అడగగా.. మద్దతు గురించి నేను ఇంకా ఏమీ అనుకోలేదని, దాని గురించి తర్వాత మాట్లాడతానని అన్నారు. మీరు జనసేన తరఫున వచ్చారని అందరూ అంటున్నారు.. మీరేమంటారు? అని ప్రశ్నించగా.. ‘నేను మళ్లీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోంటి. రాంగోపాల్ వర్మగారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జానీ మాస్టర్‌కి జగన్ గారంటే అంత ఇష్టం మున్ముందు ఏం జరుగుందో నేను తర్వాత చెప్తాను’ అని వెల్లడించారు.

Also Read: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్పీపై మంత్రి బొత్స కీలక ప్రకటన!

నెల్లూరు జనసేన రేసులో ఎవరు ?

జానీ మాస్టర్ కేవలం అంగన్వాడీల ధర్నాకు మద్దుతు తెలపడమే కాకుండా .. హరిరామజోగయ్య లాంటి రాజకీయనేతను కలవడం, జనసేన కీలక నేతలతో సమావేశం కావడం కూడా ఇప్పుడు సర్వ్త్ర చర్చనీయాంశమయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ..జానీ మాస్టర్ ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొంటారా ? లేదా నెల్లూరు జిల్లానుంచి కూడా ఆయన సీటు ఆశిస్తున్నారా నేదు ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. నెల్లూరులో ప్రస్తుతం జనసేనలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఓ గ్రూపు నాయకుడు వైసీపీలో చేరారు. అయినా కూడా రెండు వర్గాలున్నాయి. ఈ దశలో పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లాలో ఏ సీటుని టీడీపీ నుంచి తీసుకుంటారు, అది ఎవరికిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇటీవలే నాగబాబు కూడా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చారు. అన్ని నియోజకవర్గాల జనసేన నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టికెట్ల వ్యవహారం, సీట్ల వ్యవహారంపై ఆయన ఎక్కడా ప్రకటన చేయలేదు. నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని మాత్రం స్పష్టం చేశారు నాగబాబు. ఇప్పటికే రాజకీయాల్లో సినీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తోంది.జానీ మాస్టర్ వ్యూహం ఏంటి ? తదుపరి కార్యాచరణ ఏంటి అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు