Bhavyasri: భవ్య శ్రీ మరణంపై వీడని మిస్టరీ..! పోలీస్ దర్యాప్తుపై తల్లిదండ్రుల అనుమానాలు..!! భవ్యశ్రీ హత్య కేసు వారం రోజులు గడుస్తున్నా మిస్టరీ వీడడం లేదు. పోలీస్ దర్యాప్తుపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా పాపకు ఈత వచ్చు, ఎలా బావిలో దూకి చనిపోతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా భవ్యశ్రీది దారుణమైన హత్యే అంటున్నారు. మా బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకుండా ఉండాలంటే నిందితులను వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని బాధిత తల్లిదండ్రలు డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 26 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Bhavyasri : చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్ధి భవ్యశ్రీ అనుమానాస్పద మృతి వారం రోజులు గడుస్తున్నా మిస్టరీ వీడడం లేదు. పోలీస్ దర్యాప్తుపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా పాపకు ఈత వచ్చు, ఎలా బావిలో దూకి చనిపోతుంది అంటూ పోలీసులపై మండిపడుతున్నారు. కచ్చితంగా భవ్యశ్రీది దారుణమైన హత్యే అంటున్నారు. భవ్యశ్రీ హత్య కేసును పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను అతి దారుణంగా అత్యాచారం చేసి ఉరేసి చంపారని ఆరోపిస్తున్నారు. భవ్యశ్రీ డెడ్ బాడీ గుర్తించలేని స్ధితిలో.. దుస్తులు కూడా ఒంటిపై లేని పరిస్ధితిలో కనిపించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా భవ్యశ్రీది హత్యేనని వ్యాఖ్యనిస్తున్నారు. కేవలం పోలీసుల నిర్లక్ష్యం కారణంగా భవ్యశ్రీ చనిపోయిందని బాధిత తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు. గత సోమవారం భవ్యశ్రీ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తే పోలీసులు అధికారులు స్పందించలేదని.. వారు కనీసం భవ్యశ్రీ గురించి దర్యాప్తు చేపట్టింటే మా బిడ్డ బ్రతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బుధవారం వేరే గ్రామస్తులు గణేశుడి నిమర్జనం కోసం వెళ్తే బావిలో మృత దేహం కనిపించిందని..మేం మళ్లీ పోలీసులకు ఫోన్ చేసే వరకు వారు కేసును పట్టించుకోలేదని వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం భవ్య శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. ప్రాథమిక వివరాలు చూస్తే ఆత్మహత్య గా కనబడుతుందని చెప్పారు. అయితే, తల్లిదండ్రలు మాత్రం అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్నారని.. ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని ఆమె వెల్లడించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని..భవ్య శ్రీదేవి హత్య ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉందని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి అన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ట్రోల్ చేయకండి అంటూ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి సూచించారు. అయితే, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి వ్యాఖ్యనించారు. భవ్య శ్రీదేవిది హత్య? ఆత్మహత్య? అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుగుతోందని అడిషనల్ ఎస్పీ వెల్లడించారు. #chittoor-district #ap-police #bhavya-sri #inter-girl-death-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి