Bhavya Sri: భవ్యశ్రీ మృతిపై ఎస్పీ రిషాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! అసలు ఏలా చనిపోయిందంటే..? తిరుపతిలో సంచలనం సృష్టించిన భవ్యశ్రీ మృతి ఆత్మహత్యేనని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పారు. భవ్యశ్రీది ఆత్మహత్య అని తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు.ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ కేసులో ఫారెన్సీక్ రిపోర్ట్స్ చూపిన ఎస్పీ..రిపోర్ట్స్ చాలా క్లియర్ గా బావిలో నీరు తాగి మరణించినట్లు వుందిని తెలిపారు. అయితే, ఈ విషయంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 12 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Bhavya Sri Case Updates: తిరుపతిలో సంచలనం సృష్టించిన భవ్యశ్రీ మృతి ఆత్మహత్యేనని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పారు. భవ్యశ్రీది ఆత్మహత్యేనని.. తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు. ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ కేసులో ఫారెన్సీక్ రిపోర్ట్స్ చూపిన ఎస్పీ..రిపోర్ట్స్ చాలా క్లియర్ గా బావిలో నీరు తాగి మరణించినట్లు వుందిని తెలిపారు. ఎవ్వరూ భవ్యశ్రీని అఘాయిత్యాం చేయలేదని చెప్పారు. అనుమానం వ్యక్తం చేసిన నలుగురుని విచారించామని పేర్కొన్నారు. నలుగురు లొకేషన్ లో ఖచ్చితంగా లేరు అని టవర్ రిపోర్ట్స్ వున్నాయని వ్యాఖ్యనించారు. ఎవరికి అయినా అనుమానం వుంటే రిపోర్ట్స్ ఇస్తామని చెప్పారు. అయితే, ఈ కేసును ఇంకా క్లోజ్ చేయడం లేదని..ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితిలు, ప్రభావితం చేసిన వ్యక్తులను గుర్తిస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ఏ ఒత్తిడి జరగలేదని, ప్రాపర్ గా దర్యాప్తు జరిగిందని వెల్లడించారు. భవ్యశ్రీ మృతిపై తల్లిదండ్రులు కోర్టుకు వెళ్తాం అనడం వారి వ్యక్తిగతం విషయని అన్నారు. సీబీఐ వచ్చిన మా వద్ద వున్న క్లీన్ రిపోర్ట్స్ ఇస్తామని చెప్పారు. Also Read: కానిస్టేబుల్ కిరాతకం..తండ్రిని ఇంటికి పిలిపించుకుని ఏం చేశాడంటే..? మరోవైపు భవ్యశ్రీ హత్య కేసులో పోలీసుల తీరుపై బాధిత తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన కూతురిని తానే చంపేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ భవ్యశ్రీ తల్లి వాపోతోంది. భవ్యశ్రీది ఆత్మహత్య అని తేలిందని.. నువ్వే వేధించి వుంటావని పోలీసులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బిడ్డ ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని..ఒకవేళ సూసైడ్ చేసుకుంటే తన జుట్టు తానే ఎలా తీసేసుకుంటుందని ప్రశ్నించింది. తన బాడీపై ఉండాల్సిన లెగ్గిన్ ఎక్కడ అంటూ ప్రశ్నించింది. భవ్యశ్రీ హత్యకేసును పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారని బాధిత తల్లి మండిపడుతోంది. ఈ కేసును పోలీసులు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని బాధిత తల్లి ఆరోపిస్తోంది. పోలీసులు తప్పుడు రిపోర్ట్స్ చూపిస్తు మమ్మల్ని బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయం జరగడం కోసం తాను హైకోర్టు కి వెళ్తమంటూ వెల్లడించింది. చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి సంచలనం రేపుతోంది. గత నెల 20 వ తేదిన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా ఓ బావిలో భవ్యశ్రీ మృతదేహం కనిపించింది.అమ్మాయి మృతదేహం ఉన్న స్థితిని చూసి.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయికి అరగుండు చేసి.. కనురెప్పలు కత్తిరించి.. బావిలో పడేసి ఉండటం సర్వత్రా సంచలనంగా మారింది. భవ్యశ్రీని అత్యంత కిరాతకంగా చంపేసి గుర్తుపట్టకుండా చేసి బావిలో పడేశారని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. #chittoor-district #ap-police #bhavya-sri-case-update #bhavya-sri-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి