Bhola Shankar: భోళాశంకర్ టికెట్ల రేట్ల పెంపుపై ఉత్కంఠ.. ఆగ్రహంగా చిరు ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా టికెట్లపై రచ్చ కొనసాగుతూనే ఉంది. రేట్లు పెంచుకునేందుకు చిత్ర యూనిట్ అనుమతి కోరగా..సినిమా నిర్మాణ వ్యయంపై డాక్యుమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. పత్రాలు సమర్పిస్తే రేట్లు పెంచుకోవచ్చంటోంది సర్కార్. సినిమా బడ్జెట్ రూ.100కోట్లు దాటితేనే రేట్ల పెంపునకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. బడ్జెట్‌ని బట్టి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. By Trinath 10 Aug 2023 in సినిమా New Update షేర్ చేయండి Chiranjeevi Bhola shankar Ticket Price Issue: భోళాశంకర్ టికెట్ల రేట్ల లొల్లి కంటీన్యూ అవుతూనే ఉంది. రేపే (ఆగస్టు 10) సినిమా రిలీజ్ అవుతుండగా.. ఇప్పటి వరకు రేట్ల పెంపుపై ఎటు తెగలేదు. తమ చిత్రానికి టికెట్ రేటు పెంచాలని భోళా శంకర్(Bhola Shankar) చిత్ర నిర్మాత ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులో మరికొన్ని వివరాలు పొందుపరచాల్సి ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు నిర్మాతకు సూచించాయి. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్షారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు(Chandrababu) హయాంలో బాలకృష్ణకు ఓ న్యాయం, మిగిలిన వారికి ఓ న్యాయం అన్నట్టు తాము వ్యవహరించలేదన్నారు. సినిమాల్లో బడ్జెట్ లింక్డ్ టికెటింగ్ వ్యవస్థను తాము అమలు చేస్తున్నామని సజ్జల గుర్తు చేశారు. ఎవరైనా సరే తమ సినిమా బడ్జెట్‌కు సంబంధించి డాక్యుమెంట్స్ సమర్పించి టికెట్లు పెంచుకోవచ్చన్నారు. సాక్ష్యాలు ఎక్కడ భోళా? నిజానికి రూ.100కోట్ల బడ్జెట్ దాటితేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఉంది. దానికి సంబంధించి సరై ఫ్రూఫ్స్ ఉంటే చాలు. ఈ నిబంధన ఏ సినిమా హీరోకైనా వర్తిస్తుంది. ఇక రెమ్యూనరేషన్ కాకుండానే తమ సినిమా బడ్జెట్ రూ.100కోట్లు దాటిందని చిత్ర నిర్మాణ బృందం చెబుతోంది. అయితే చెప్పడం కాదని.. సరైన ఆధారాలు చూపాలని ప్రభుత్వం వాదిస్తోంది. సమర్పించిన డాక్యుమెంట్స్ ప్రకారం నిర్మాన వ్యయం రూ.30 కోట్ల నుంచి రూ.40కోట్ల మధ్యే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇతర సినిమాల లాగానే డాక్యుమెంట్స్ సమర్పించాలని స్పష్టం చేస్తోంది. ఇది రివేంజా? రూలా? మరోవైపు చిరంజీవి(Chiranjeevi) ఇటివలి వైసీపీ టార్గెట్‌గా పరోక్ష విమర్శలు గుప్పించారు. వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ ఫంక్షన్‌లో భాగంగా హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ నేతలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా తమపై పడవద్దంటూ చురకలంటించారు. అందుకే వైసీపీ ప్రభుత్వం చిరుపై ఈ విధంగా రివేంజ్ తీర్చుకుంటుందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అటు చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ చిత్రం రేపు (ఆగస్టు 11)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, రఘు బాబు, వెన్నెల కిశోర్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, ప్రగతి, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా, గెటప్ శ్రీను, కాశీ విశ్వనాథ్, సితార, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. డూడ్లీ సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. Also Read: “జైలర్” ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ ఏం అంటున్నారంటే…!! #ys-jagan #cm-ys-jagan #megastar-chiranjeevi #sajjala #bhola-shankar #bhola-shankar-controversy #chiranjeevi-bhola-shankar-ticket-price-issue #bholaa-shankar-ticket-price-issue #bholaa-shankar-ticket-rate-issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి