AP: నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి ఏపీకి తాను సీఎం కాకుండా చిరంజీవి అడ్డకున్నారని వైసీపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆరోపించారు. తనకు, తన ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ సీఎం అవకాశం లభించకూడదనే మనస్తత్వంతో చిరు ఉండేవారని చెప్పారు. తాను చిరుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు.

New Update
AP: నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు

AP: వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satynarayana) నటుడు చిరంజీవి (Chiranjeevi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన.. విభజన సమయంలో జరిగిన సంఘటనలతోపాటు చిరంజీవి రాజకీయం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఈ మేరకు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయకపోతే అప్పుడే ముఖ్యమంత్రి(CM) అయ్యేవారని చెప్పారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో తనను ముఖ్యమంత్రి కాకుండా చిరు అడ్డుపడ్డాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

చిరంజీవి అడ్డుకున్నారు..
బోత్స మాట్లాడుతూ.. 'నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ దానిని చిరంజీవి అడ్డుకున్నారు. చిరు తనకు, తన ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ ముఖ్యమంత్రి అవకాశం లభించకూడదనే మనస్తత్వంతో ఉండేవారు. నిజానికి చిరును నేను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను. నేను ముఖ్యమంత్రి అయితే చిరు సామాజిక వర్గానికి న్యాయం చేసేవాడిని' అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే విభజన సమయంలో జరిగిన సంఘటనలపై త్వరలోనే ఒక పుస్తకం రాయబోతున్నట్లు మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి : Dubai: అరబ్బుల నేలపై తొలి హిందూ దేవాలయం.. ప్రత్యేకతలివే!

ఒక్కరు ముఖ్యమంత్రి కాలేదు..
ప్రస్తుతం మంత్రి బొత్స వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ(Ysrcp) వ్యూహాత్మకంగానే చిరంజీవి పేరు ప్రస్తావిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగనుండగా రాజకీయాలను పూర్తిగా వదిలేసిన చిరును ఇందులోకి లాగడం వెనుకాల ఏదో పెద్ద ప్లాన్ ఉందంటున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గాల్లో కాపులు ఒకటి. కాగా ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు సీఎం పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒక్కరు ముఖ్యమంత్రి కాలేదు. దీంతో పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కొంతమంది కాపు నేతలు కోరుతున్న నేపథ్యంలో బొత్స చిరంజీవిపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు