Mahabubnagar: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయి.. ఎస్పీ యేగేష్ గౌతమ్!

చిన్నపొర్ల భూ వివాదం కేసుపై ఎస్పీ యేగేష్ గౌతమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సై బి.శ్రీనివాసులను సస్పెండ్‌ చేశామని చెప్పారు. నిందితులందరినీ పట్టుకుంటామన్నారు.

New Update
Mahabubnagar: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయి.. ఎస్పీ యేగేష్ గౌతమ్!

Crime: రాష్ట్రంలో సంచలనం రేపిన మహబూబ్ నగర్ ఊట్కూర్ చిన్నపొర్ల భూ వివాదం కేసుపై ఎస్పీ యేగేష్ గౌతమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు ఠాణా వద్ద విలేకరులతో మాట్లాడిన ఎస్సీ.. ఎర్రగండ్ల లక్ష్మప్పకు చెందిన ఇరు కుటుంబాల మధ్య భూ వివాదం కేసు కోర్టులో కొనసాగుతుందని చెప్పారు. లక్ష్మప్ప రెండో భార్య కుటుంబ సభ్యులు పొలం దున్నేందుకు వెళ్లిన మొదటి భార్య కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు తెలిపారు. మొదటి భార్య కుటుంబ సభ్యుల మూకుమ్మడి దాడితో తీవ్రంగా గాయపడి సంజప్ప(28) మృతి చెందారన్నారని చెప్పారు. ఈ ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేశామని, క్షేత్రస్థాయిలో విచారించి ఘటనకు సంబంధమున్న మరి కొంతమందిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

ఈ ఘటన నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై బి.శ్రీనివాసులను సస్పెండ్‌ చేశామని చెప్పారు. మృతుడి చిన్నమ్మ జి.కవిత ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేయగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. నిందితులైన చిన్న వెంకటప్ప ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, గువ్వలి సంజీవ్‌ అలియాస్‌ గుట్టప్ప, ఆటో సంజీవ అలియాస్‌ గువ్వలి సంజీవ్‌ పరారీలో ఉన్నారని తెలిపారు. వెంకటప్ప అలియాస్‌ నట్టల్‌ అలియాస్‌ గువ్వలి చిన్న సంజప్ప, గుడ్డి అశప్ప అలియాస్‌ అశోక్, గువ్వలి శ్రీను, గువ్వలి కిష్టప్పలను శనివారం రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు