Qin Gang Missing: చైనాలో అంతే.. ఆరునెలలుగా మాజీ మంత్రి మిస్సింగ్.. చనిపోయినట్టు తాజాగా ప్రకటన 

చైనాలో వ్యక్తులు కనిపించకుండా పోవడం.. తరువాత వారు మరణించినట్టుగా ప్రకటించడం సహజం. తాజగా చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ జెంగ్ ఆ లిస్ట్ లో చేరారు. ఆరునెలల నుంచి ఆయన కనిపించలేదు. ఇప్పుడు ఆయన మరణించారని చెబుతున్నారు. 

New Update
Qin Gang Missing: చైనాలో అంతే.. ఆరునెలలుగా మాజీ మంత్రి మిస్సింగ్.. చనిపోయినట్టు తాజాగా ప్రకటన 

Qin Gang Missing: ఆరు నెలలుగా కనిపించకుండా పోయిన చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ జెంగ్ కన్నుమూశారు. అమెరికన్ మీడియా హౌస్ పొలిటికో ఈ విషయాన్ని వెల్లడించింది. క్విన్ మరణానికి కారణం ఆత్మహత్య లేదా చిత్రహింస అని ఆ రిపోర్ట్ తెలిపింది. జూలైలో బీజింగ్లోని సైనిక ఆసుపత్రిలో క్విన్ మరణించినట్లు ఇద్దరు చైనా అధికారులను ఉటంకిస్తూ పొలిటికో నివేదించింది. చైనా అగ్రనేతలు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితుడైన క్విన్ ను ఈ ఏడాది జూలైలో విదేశాంగ మంత్రి పదవి నుంచి తొలగించారు. గూఢచర్యం కూడా చేశాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం ఇంకా విచారణలో ఉంది.

చైనాలోని ప్రముఖ టీవీ యాంకర్ ఫు జియావోటియన్ తో క్విన్ కు(Qin Gang Missing) ఎఫైర్ ఉందని, అందుకే ఆయనను విదేశాంగ మంత్రి పదవి నుంచి తొలగించారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. మీడియా నివేదికల ప్రకారం, క్విన్ కు ఈ యాంకర్ తో ఒక కుమారుడు కూడా ఉన్నాడు, అతను అమెరికన్ పౌరుడు. 

Also Read: ప్లీజ్ మాకు యుద్ధంలో హెల్ప్ చేయండి..పాక్ ను కోరిన హమాస్

పొలిటికో రిపోర్ట్  ప్రకారం క్విన్(Qin Gang Missing) చైనా అణు రహస్యాలను అమెరికాకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. జెంగ్ వెంట మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్ఫు, చైనా రాకెట్ ఫోర్స్ కమాండర్ లియు యుచావో ఉన్నారని చైనా అధికారులను ఉటంకిస్తూ పొలిటికో నివేదించింది. ఈ రాకెట్ ఫోర్స్ చైనా అణు కార్యక్రమానికి బాధ్యత వహిస్తుంది. ఈ విషయాన్ని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి రుడెంకో జిన్ పింగ్ కు తెలియజేశారు. క్విన్ కనిపించకుండా పోయిన సమయంలో, లూ కూడా అదృశ్యమయ్యాడు. దీంతో పాటు పలువురు సీనియర్, మాజీ సైనికాధికారులను ఒకేసారి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మందిని ఆ తర్వాత పదవి నుంచి తొలగించారు. వీటన్నింటి మధ్య అప్పటి రక్షణ మంత్రి లీ షాంగ్ఫు కూడా కనిపించకుండా పోయారు. అక్టోబరులో చైనా ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించింది.

జెంగ్ చివరిసారిగా జూన్ 25న కనిపించారు.. 

మే నెలలో గోవాలో జరిగిన ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సదస్సుకు కూడా మాజీ విదేశాంగ మంత్రి Qin Gang Missing హాజరయ్యారు. చివరిసారిగా జూన్ 25న రష్యా, శ్రీలంక, వియత్నాం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన బహిరంగ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. విదేశాంగ విధానాలపై గట్టి సమాధానం ఇచ్చే దౌత్యవేత్తగా పేరొందిన క్విన్ జెంగ్ 2022 డిసెంబర్లో చైనా విదేశాంగ మంత్రి అయ్యారు.

Qin Gang in Goa షాంఘై సహకార సంస్థ సమావేశం కోసం క్విన్ గెంగ్ గోవాకు వచ్చినప్పటి ఫోటో

చైనాలో కొత్తేమీ కాదు.. 

 శక్తివంతమైన వ్యక్తులు అదృశ్యం కావడం చైనాలో కొత్తేమీ కాదు. ఆధునిక చైనా స్థాపకుడు మావో కాలం నుంచి ఇది కొనసాగుతోంది. హండ్రెడ్ ఫ్లవర్స్ క్యాంపెయిన్ మావో కాలంలోనే నడిచింది. దీని కింద ప్రజలు విమర్శించే అవకాశం కల్పించారు. వ్యవస్థలోని లోపాలను చెప్పాలని కోరారు. దీంతో చాలా మంది ఇలా విమర్శలు చేశారు కానీ ఆ వ్యక్తులు తరువాత కనిపించకుండా పోయారు.  ఇది మావో ట్రిక్ అని చెబుతారు.  నిజానికి లోపల తన ప్రత్యర్థులను గుర్తించడం కోసం ఈ ట్రిక్ ఉపయోగించాడు మావో. ఇప్పుడు జిన్ పింగ్ కూడా అదే ట్రిక్ ను అనుసరిస్తున్నారని అంటున్నారు. చైనాలో అదృశ్యమైన వారి జాబితాలో నటులు, కార్యకర్తలు, క్రీడాకారుల వరకు చాలా మంది పేర్లు ఉన్నాయి.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు