AP News: చిన్నారి లక్షిత కిడ్నాప్ కథ సుఖాంతం...పోలీసుల అదుపులో కిడ్నాపర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాత్రి కిడ్నాప్నకు గురైన చిన్నారి లక్షిత కథ సుఖాంతమైంది. ఎస్పీ మాధవరెడ్డి సమక్షంలో చిన్నారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

New Update
AP News: చిన్నారి లక్షిత కిడ్నాప్ కథ సుఖాంతం...పోలీసుల అదుపులో కిడ్నాపర్

పుట్టపర్తి (Puttaparthi)లోని మోర్ సూపర్ బజార్ సమీపంలో ఆడుకుంటున్న లక్షిత (5)ను సాయికుమార్ అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. పాప కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు (parents) గిరినాయక్ అరుణాబాయి పలుచోట్ల గాలించి భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిండితుడు దిక్కు తెలియక చిన్నారిని ప్రశాంతి నిలయం సమీపంలో వదిలేసి వెళ్లిపోయాడు.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
పాపను గుర్తించిన పోలీసులు చిన్నారిని సురక్షితంగా స్టేషన్‌కు తరలించి ఎస్పీ మాధవరెడ్డి (SP Madhav Reddy) సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదే క్రమంలోనే నిందితున్ని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. దాదాపు వెయ్యి మంది యువకులు స్థానిక పోలీసుల సాయంతో అణువణువునా గాలించి చిన్నారిని సురక్షితంగా పట్టుకోగలిగామని తెలిపారు. చిన్నారిని కాపాడేందుకు సహకరించిన యువతను అభినందిస్తున్నట్లు తెలియజేశారు. చిన్నపిల్లల్ని బయటకు పంపించే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
ఇది కూడా చదవండి: శీతాకాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

#puttaparthi #sri-satyasai-district #ap-news
Advertisment
Advertisment
తాజా కథనాలు