Chicken-Mutton Bone Soup: చికెన్, మటన్ సూప్‌లతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..? ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. బయట ఫుడ్ తినకుండా ఇంట్లో వండుకొని తింటే ఆరోగ్యం బాగుంటుంది. చికెన్,మటన్ సూప్ వారంలో 3 సార్లు తాగితే ఆరోగ్యంతో పాటు చర్మం కూడా సౌందర్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Dec 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Chicken-Mutton Bone Soup: మన అనారోగ్యానికి విటమిన్-సీ ఎంతో మంచిది. ఇందులో ఉండే కొల్లాజాన్ మన చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. ఇది కేవలం చర్మం కాకుండా కండారాలు, కీళ్లు, జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కొల్లాజెన్ ఒక రకమైన ప్రోటీన్ ఆరోగ్యాన్ని, చర్మం, జుట్టు, గోర్లు ఎముకల కావలసిన పోషకాలను అందిస్తుంది. అయితే ఈ కొల్లాజెన్ ఏర్పడాలంటే అది కేవలం మనం తినే ఆహార పదార్థాల ద్వారానే సాధ్యమవుతుంది. కొల్లాజెన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం ద్వారా మన శరీరంలో విటమిన్-సి కావలసినంత ఉత్పత్తి అవుతుంది. ఈ సూప్‌లు తాగటం వలన కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. ఈ సూప్ తాగితే కలిగే ప్రయోజనాలు చికెన్,మటన్ సూప్ వారంలో 3,4 సార్లు తాగితే చర్మం సౌందర్యం పెరుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు తగ్గి.. కాల్షియం ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మటన్,చికెన్ సూప్ తాగితే శరీరానికి కొల్లాజన్ విపరీతంగా అందుతుంది. కొంతమంది చికెన్, మటన్‌లు వారానికి 2,3 సార్లు తింటారు. అయితే మటన్, చికెన్ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మటన్,చికెన్ వాటి సూప్ తాగితే ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బోన్స్ పులుసు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. బోన్స్ షూట్లో కొల్లాజెన్ అధికంగా ఉంటుంది. చికెన్, మటన్ లాంటి తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎల్లప్పుడు మన చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా..? కీళ్ల నొప్పులు పోవాలన్నా..? ఎక్కువగా చేపలను తినాలి. సముద్రం చేపల్లో కొల్లాజెన్‌తోపాటు ఒమేగా-3 ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సముద్రపు చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొల్లాజెన్ పెరగాలంటే చికెన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. చర్మం కూడా బాగుంటుంది. కోడిగుడ్డులోని తెల్లసొన తింటే తొందరగా బరువు తగ్గుతారు. తెలుపు భాగాన్ని తిన్నట్లయితే కొల్లాజెన్ బాగా ఏర్పడుతుంది. ఇందులోని అమైనో ఆమ్లం కొల్లాజెన్ ఏర్పడేందుకు సహాయపడుతుంది. ఆరెంజ్, నిమ్మకాయలు, బత్తాయి కాయల్లో కొల్లాజెన్ అధికంగా ఉంటుంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెరీలు, కివి పండ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది కూడా కొల్లాజెన్ ఏర్పడేందుకు బాగా ఉపయోగపడతాయి. కొల్లాజన్ అనే పదార్థం కండరాలు, కీళ్లు, జుట్టు బలంగా ఉంచుతుంది. ఈ సూప్ తాగితే కొలెస్ట్రాల్ తగ్గి.. బరువు కూడా పెరగరు. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. మటన్, చికెన్ సూప్ వారంలో తాగేలా ప్లాన్ చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పెదాలకు లిప్‌స్టిక్ ఎక్కువ సేపు ఉండాలంటే..ఈ టిప్ #health-benefits #chicken-mutton-bone-soup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి